NTV Telugu Site icon

Devara : ఎన్టీఆర్‌కు షాకివ్వబోతున్న జాన్వీ..అదిరిపోయే క్లైమాక్స్..

Devar Janvikapoor

Devar Janvikapoor

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ఇప్పుడు స్పీడ్ ను పెంచాడు.. వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు.. ఇటీవల ట్రిపుల్ ఆర్ సినిమా ఎన్టీఆర్ లైఫ్ ను మార్చివేసింది..అప్పటి నుంచి మరింత ఉత్సాహంతో కనిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే తారక్ తన 30వ చిత్రం ‘దేవర’ను చేస్తున్నాడు. టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్ అయిన కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లోనే కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందుతోంది. దాంతో సినిమా పై హైప్ ఏర్పడింది.

ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ‘దేవర’ మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను గత మార్చి నెలలోనే మొదలు పెట్టారు. ఆ వెంటనే దీనికి సంబంధించిన రెండు భారీ యాక్షన్ షెడ్యూళ్లను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నారు..ఇక వచ్చేవారం నుంచి మూడో షెడ్యూల్ ను ప్రారంభించానున్నారు.. ఆ షూటింగ్ కు హీరోయిన్ జాన్వీ కపూర్, అలీ ఖాన్ కూడా భాగం కాబోతున్నారు. ఇందులో కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలిసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ న్యూస్ లీకైంది..

జన్వీ కపూర్ ఇందులో ఆమె ఓ అండర్ కవర్ ఆఫీసర్‌గా నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.. కోస్టల్ ఏరియాలో ఓ డాన్‌ అయిన ఎన్టీఆర్‌పై నిఘా పెట్టేందుకు అధికారులు ఆమెను అక్కడకు పంపిస్తారట. అందుకే ఆమె జాలరి యువతిగా కనిపిస్తుందట. కానీ, ఆమె రియల్ క్యారెక్టర్ రివీల్ అయ్యే ట్విస్ట్ ప్రి ఇంటర్వెల్‌లో వస్తుందని తెలిసింది.. ఈరోజు సీన్ థియేటర్లలో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయమని టాక్.. ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ మూవీని 2024 ఏప్రిల్ 5వ తేదీన విడుదల చెయ్యనున్నట్లు ప్రకటించారు.. సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ వెయిట్ చెయ్యాలి..