‘స్టార్ మా’ డ్యాన్స్ ప్లస్ విజేతగా సంకేత్ సహదేవ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొద్ది నెలలుగా స్టార్‌మాలో అత్యంత ఆసక్తిగా జరుగుతున్న స్టార్ మా డ్యాన్స్ ప్లస్ పోటీల ఫైనల్స్ ఆదివారం రసవత్తరంగా జరిగాయి. ఒకరిని మించిన ప్రదర్శన మరొకరు చేస్తూ వీక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు. ప్రతి వారం వినూత్న నేపథ్యాలతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న ఫైనలిస్ట్‌లు ఫైనల్స్‌లో తమదైన సృజనాత్మకత, వైవిధ్యతను చూపడానికి ప్రయత్నించి సఫలీకృతులయ్యారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వచ్చిన లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన ప్రతి ఒక్కరికీ వినోదాన్ని పంచుతూ స్టార్ మా డ్యాన్స్ ప్లస్ ఫైనల్స్ లో వాసి టోనీ (యశ్వంత్ మాస్టర్ టీమ్), సంకేత్ సహదేవ్ (యశ్వంత్ మాస్టర్ టీమ్), మహేశ్వరి – తేజస్విని (బాబా మాస్టర్ బృందం), జియా ఠాకూర్ (అనీ మాస్టర్ బృందం), డార్జిలింగ్ డెవిల్స్ (రఘు మాస్టర్ బృందం) పోటీపడ్డారు. శాస్త్రీయ నృత్యానికి పాశ్చాత్య నృత్య రీతులను కూడా మిళితం చేసి మహేశ్వరి–తేజస్విని ఆకట్టుకుంటే, తమదైన వైవిధ్యతను చూపుతూ మిగిలిన పోటీదారులు ఆకట్టుకున్నారు. ఈ సీజన్ విజేతగా సంకేత్ సహదేవ్ నిలువడంతో పాటుగా 20 లక్షల రూపాయల బహుమతినీ గెలుచుకున్నారు. గత 21 వారాలుగా స్టార్ మాలో ప్రసారమవుతున్న డ్యాన్స్ ప్లస్ షో హోస్ట్, దర్శకునిగా ఓంకార్ వ్యవహరించారు.
Also Read
తాజావార్తలు
-
US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
-
Explainer: భారీ షాక్.. అక్టోబర్ 1 నుంచి పెరగనున్న ధరలు!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
North Korea vs South Korea: సరిహద్దులో ఉద్రిక్తత.. దక్షిణ కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్
-
NC 25 : నాగచైతన్య 25వ సినిమాపై ఆ పుకార్లు నమ్మొద్దు
ట్రెండింగ్
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!