NTV Telugu Site icon

Bhavani Ward 1997: చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. రాజ్ కందుకూరి ఆసక్తికర వ్యాఖ్యలు

Bhavani Ward

Bhavani Ward

హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో ‘భవానీ వార్డ్ 1997’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జీడీఆర్ మోషన్ పిక్చర్, విభూ మీడియా సమర్పణలో చంద్రకాంత సోలంకి, జీడీ నరసింహా నిర్మించిన ఈ సినిమాకి జీడీ నరసింహా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో గాయత్రీ గుప్తా, గణేష్ రెడ్డి, పూజా కేంద్రే, సాయి సతీష్, జబర్దస్త్ అప్పారావు, ఈశ్వర్ బాబు ధూళిపూడి తదితరులు నటించారు. ఈ మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ కాబోతోంది.

Prashanth Karthi : ఆ పాత్ర అందుకే ఒప్పుకున్నా: ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

ఈ క్రమంలో సోమవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో దర్శకుడు జి.డి. నరసింహా మాట్లాడుతూ మా సినిమాలో ప్రతీ ఒక్కరూ అద్భుతంగా నటించారు. గణేష్, పూజా కేంద్రే ఇలా అన్ని పాత్రలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. మ్యూజిక్ మీ అందరినీ భయపెట్టేలా ఉంటుంది. విజువల్స్ చాలా కొత్తగా ఉంటాయి. ఫిబ్రవరి 7న మా చిత్రం రాబోతోంది. అదే రోజున తండేల్ కూడా రాబోతోంది. అన్ని సినిమాలు చూసి సపోర్ట్ చేయండి. హారర్ చిత్రాలను ఇష్టపడే వారందరికీ మా భవానీ వార్డ్ 1997 నచ్చుతుంది’ అని అన్నారు.