టైమ్ కలిసి వచ్చినప్పుడే అల్లుకుపోవాలి. కానీ, అవికా గోర్ వద్దని అల్లంత దూరంగా వెళ్లిపోయింది. ఇప్పుడేమో గతంలో ఉన్నంత డిమాండ్ లేదు. అయినా కూడా ఆమె టాలీవుడ్ పైనే దృష్టి పెట్టి హైద్రాబాద్ లో మకాం వేస్తోంది.
అవికా బుల్లితెర మీద సూపర్ ఫేమస్. ‘చిన్నారి పెళ్లికూతురు’గా హిందీలోనూ, తెలుగులోనూ కూడా డైలీ సీరియల్ తో జనానికి పరిచయమే. అయితే, ‘ఉయ్యాల జంపాల’తో హీరోయిన్ గా మారింది క్యూట్ బ్యూటీ. ఫస్ట్ మూవీలోనే మంచి మార్కులు పడ్డాయి. బాక్సాఫీస్ సక్సెస్ కూడా వచ్చింది. మరింకేం ఉంది… వరుసగా తెలుగు సినిమాలు చేస్తుంది అనుకున్నారు అంతా. కానీ, అవికా తొలి విజయం తరువాత కంటిన్యూగా టాలీవుడ్ పై కాన్సన్ట్రేట్ చేయలేదు. ఫలితంగా ‘సినిమా చూపిస్త మావ, ఎక్కడికి పోతావు చిన్న వాడా’ లాంటి చిత్రాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నా బిజీ హీరోయిన్ కాలేకపోయింది.
హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఉన్న డిమాండ్ అవికా ఇప్పుడు ఆశించటం కష్టమే. ఎందుకంటే, అప్పటికి ఇప్పటికీ సీన్ మారిపోయింది. బోలెడు కొత్త అందాలు ఇండస్ట్రీలోకి వచ్చేశాయి. అందుకే, అవికా సినిమాల వేటలో ఉన్న కెరీర్ మాత్రం స్లోగా సాగుతోంది. ఆమె ప్రస్తుతం నాగ చైతన్య ‘థాంక్యూ’ మూవీలో ఒక హీరోయిన్ గా నటిస్తోంది. మెగా అల్లుడు కల్యాణ్ దేవ్ సినిమాలోనూ కథానాయికగా కనువిందు చేయనుంది. అలాగే ఆదిసాయికుమార్ హీరోగా రూపొందే ‘అమరన్’ చిత్రంలో కూడా అవికా గోరే హీరోయిన్. ఈ సినిమాల్లో ఏది సూపర్ హిట్టైనా అవికా దూకుడు పెరిగే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి…
పెద్ద ఆఫర్ల వేటలో… ‘చిన్నారి పెళ్లికూతురు’!
