Site icon NTV Telugu

‘ఇండిపెండెన్స్ డే’కి ముందు… విమానాలతో బరిలోకి అజయ్ దేవగణ్!

అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘భుజ్ : ద ప్రైడ్ ఆఫ్ ఇండియా’ ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకుంది. కరోనా ప్యాండమిక్ వల్ల పలుమార్లు ఈ భారీ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది. అయితే, ఇప్పుడిక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మాత్రం మిగిలింది. ఎలాగైనా ఆగస్ట్ 13వ తేదీలోపు ఎడిటింగ్ కంప్లీట్ చేసి డిస్నీ హాట్ స్టార్ లో సినిమాని జనం ముందుకు తీసుకురావాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు.

Read Also: తిరుమలలో నిత్యాన్నదానం కోసం నిర్మాత ఆనంద ప్రసాద్ కోటి విరాళం

అభిషేక్ దుదహియా దర్శకత్వం వహించిన ‘భుజ్’కి అజయ్ దేవగణ్ ఒక నిర్మాత కూడా. ఆయనతో బాటూ టీ-సీరిస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ ఈ పీరియాడికల్ పాట్రియాట్రిక్ డ్రామాని నిర్మిస్తున్నాడు. భారీ షూటింగ్ షెడ్యూల్స్ వల్ల ఇంత కాలం ఆలస్యమైన ‘భుజ్’ ఇప్పుడు ఎడిటింగ్ టేబుల్ పై ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అజయ్ దేవగణ్ తన సినిమాని ఆగస్ట్ 13న నెటిజన్స్ ముందుకు తెచ్చే యోచనలో ఉన్నాడట. విజువల్ ఎఫెక్ట్స్ వల్ల విడుదల వాయిదా పడే అవకాశాలు ఇప్పటికీ ఉన్నప్పటికీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగానే ‘భుజ్’ మన ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read Also: ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సాహసాలు, చారిత్రక విజయాల నేపథ్యంలో తెరకెక్కిన ‘భుజ్’ కాకుండా ‘మేడే’ పేరుతో మరో ఎయిర్ ఫోర్స్ మూవీ అజయ్ చేస్తున్నాడు. అందులో సౌత్ బ్యూటీ రకుల్ నటించగా ‘భుజ్’లో ప్రణీత సుభాష్ కీలక పాత్ర పోషించింది. చూడాలి మరి, ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్ట్ 13వ తేదీనే ఆన్ లైన్ లో స్ట్రీమింగ్ అవ్వనున్న అజయ్ దేవగణ్ స్టార్ వార్ ఎంటర్టైనర్… ఎలాంటి రెస్పాన్స్ పొందుతుందో!

Exit mobile version