Site icon NTV Telugu

‘రాకీ’తో కరణ్ జోహర్… ఫోటో వైరల్!

*తఖ్త్’ అనే పీరియాడికల్ మూవీ తీద్దామని చాలా రోజులు ప్రయత్నాలు చేశాడు కరణ్ జోహర్. కానీ, గత కొన్నాళ్లుగా ఆయన టైం అంతగా రైట్ మోడ్ లో నడవటం లేదు. అంతే కాదు, కరణ్ పై వస్తోన్న వ్యక్తిగత ‘నెపోటిజమ్’ విమర్శలతో పాటూ కరోనా మరింత కఠినం చేసేసింది బిగ్ మూవీస్ ప్రొడక్షన్ ని! అందుకే, వందల కోట్ల ‘తఖ్త్’ వ్యవహారం పక్కన పెట్టేశాడు కేజో. అయితే, తనకు బాగా అలవాటైన రొమాంటిక్ కామెడీ జానర్ లో రణవీర్, ఆలియ భట్ జంటగా ‘రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’ అనౌన్స్ చేశాడు కొద్ది రోజుల క్రితం! ఇప్పుడు బీ-టౌన్ లో ఈ సినిమా హాట్ టాపిక్ గా మారింది…

ఇంకా సెట్స్ మీదకు వెళ్లని ‘రాకీ ఔర్ రాణీ… ‘ మూవీ అప్పుడే అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. రణవీర్, ఆలియాతో పాటూ ధర్మేంద్ర, జయ బచ్చన్, షబానీ ఆజ్మీ కూడా ఇందులో ఉండటంతో ప్రేక్షకులు సైతం కరణ్ రోమాంటిక్ ఎంటర్టైనర్ పై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇక సొషల్ మీడియాలో తన అప్ కమింగ్ మూవీ ఎప్పటికప్పుడు ట్రెండ్ అయ్యేలా ఓ న్యూ పిక్ షేర్ చేశాడు, రీసెంట్ గా కరణ్ జోహర్. రణవీర్ సింగ్ తో కలసి ఉన్న ఆయన ఇన్ స్టాగ్రామ్ లో స్టోరీగా ఈ ఫోటో పోస్ట్ చేశాడు. ఇద్దరూ కళ్లజోళ్లు పెట్టుకుని వైట్ కాస్ట్యూమ్స్ లో స్టైలిష్ గా కనిపించారు. ‘రాకీ ఉస్కా నామ్’ అంటూ రణవీర్ ని ట్యాగ్ చేశాడు కరణ్…
‘రాకీ ఔర్ రాణీ… ‘ సినిమా 2022లో విడుదల కానుండగా… ఆ లోపే రణవీర్ ’83, సర్కస్, జయేశ్ భాయ్ జోర్దార్, సూర్యవంశీ’ చిత్రాల్లో కనిపించనున్నాడు.

Exit mobile version