NTV Telugu Site icon

పాన్ ఇండియా స్టార్ తో రష్మీక డేటింగ్ ?

Rashmika wants to go on a date with Pan-India star

‘చలో’ సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయం అయిన కన్నడ బ్యూటీ రష్మిక మండన్న. టాలీవుడ్‌లో చాలా తక్కువ వ్యవధిలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. 25 ఏళ్ల ఈ నటి స్టార్ హీరో చిత్రాలలో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను పొందుతూ సౌత్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది. ఇటీవలే బాలీవుడ్ ఎంట్రీకి కూడా సిద్ధమైంది. ఇక విషయానికొస్తే ఇటీవలే రష్మిక తన డేటింగ్ కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. తాను ఒక తెలుగు స్టార్ హీరోతో డేటింగ్ కు వెళ్లాలని అనుకుంటోందట. అది ఎవరో కాదు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్… అవును ఈ విషయాన్ని స్వయంగా రష్మికనే చెప్పింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రష్మిక ఈ విషయాన్ని వెల్లడించింది. తనకు అవకాశం వస్తే తప్పకుండా ఒకరోజు ప్రభాస్‌తో డేట్‌కు వెళ్తానని ఆమె వివరించారు. తాను బాహుబలి నటుడికి విపరీతమైన అభిమానినని తెలిపింది. రష్మిక పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’లో కనిపించనుంది. ప్రస్తుతం బాలీవుడ్ చిత్రం ‘మిషన్ మజ్ను’ కోసం పని చేస్తోంది.