Site icon NTV Telugu

ఇవి ఆత్మహత్యలు కావు, కేసీఆర్ హత్యలు : వైఎస్ షర్మిల

సీఎం కేసీఆర్ పై మరోమారు వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. గ‌డిచిన 70 రోజుల్లోనే రెండు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని…ఇవి ఆత్మహత్యలు కావు, కేసీఆర్ చేసిన‌ హత్యలని నిప్పులు చెరిగారు. కేసీఆర్ రైతులను ఆత్మహత్యలు చేసుకునేలా దిగజారుస్తున్నాడని…ఆయ‌న‌ కు రైతుల ఉసురు తగులుతుందని మండిప‌డ్డారు. ముఖ్యమంత్రి అన్నాక ముందుచూపు ఉండాలని…. ఎందుకు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడో అర్థం కావ‌డం లేద‌ని ఫైర్ అయ్యారు.

https://ntvtelugu.com/botsa-fire-on-ashok-gajapati-raju/

రుణమాఫీ చేసి ఉంటే ఈ రైతులు బతికేవారని… పరిపాలన చేతకాక ధర్నాలు చేస్తూ.. చావు డప్పులు కొడుతూ… ఢిల్లీ వెళ్లి అప్పాయిం ట్మెంట్ కూడా పొందలేకపోతున్నారని మండిప‌డ్డారు. మీ కుటుంబం తప్ప ఏ కుటుంబమన్నా బాగుపడిందా అని ప్ర‌శ్నించారు. హర్యానాలో చనిపోయిన రైతులకు ఆర్థిక సహయం చేస్తాడంట కానీ… ఇక్కడ చనిపోయిన రైతులకు ఒక్క పైసా ఇవ్వ‌రా అని నిల‌దీశారు. యాసంగిలో కాదు ఏ కాలంలో నైనా వరి పండించుకునే హక్కు రైతులకు ఉందన్నారు.

Exit mobile version