NTV Telugu Site icon

బ‌ల్లిని చూసి కేక‌లు పెట్టిన ష‌ర్మిల‌..

YS Sharmila

ఒక్కో మ‌నిషికి ఒక్కో ర‌క‌మైన భ‌యాలు ఉంటాయి.. వారు సామాన్యులైనా కావొచ్చు.. రాజ‌కీయ నేత‌లైనా కావొచ్చు.. మ‌రెవ‌రైనా అయిఉండొచ్చు.. ఇవాళ వికారాబాద్ జిల్లాలో ప‌ర్య‌టించిన వైఎస్ ష‌ర్మిల‌.. ధాన్యం కొనుగోళ్ల‌లో ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యంపై సీఎం కేసీఆర్‌ను నిల‌దీశారు.. తాను రైతుల‌కు అండ‌గా ఉంటాన‌ని.. రైతులు పండించిన పంట‌ను కొనాల్సిందేన‌ని డిమాండ్ చేశారు.. అయితే, త‌న ప‌ర్య‌ట‌న‌లో సంచుల్లో పోసి క‌ప్పిఉంచిన ధాన్యాన్ని ప‌రిశీలించాల‌నుకున్నారు ష‌ర్మిల‌.. రైతులు, త‌న అభిమానులు, నేత‌ల‌తో క‌లిసి ముందుకు క‌దిలిన ఆమె.. అక్క‌డ వ‌రి ధాన్యంపై క‌ప్పి ఉన్నప‌ట్టాను తొల‌గించాల‌ని చూశారు.. ఆమె చేయి పెట్టి ఆ ప‌ట్టాను తొల‌గించే ప్ర‌య‌త్నం చేయ‌గా.. అక్క‌డ ఏదో క‌ద‌ల‌డంతో.. కేక‌లు వేస్తూ.. రెండు చేతుల‌తో చెవులు మూసుకుంటూ.. వెన‌క్కి క‌దిలారు.. అది గ‌మ‌నించిన గ‌న్‌మ‌న్ ఏముందో అని చూడ‌గా.. అప్ప‌టికే ఆ బ‌ల్లి కింద‌ప‌డిపోయింది.. బ‌ల్లి అని చెప్ప‌డంతో.. ఆ త‌ర్వాత ముందుకు క‌దిలారామె.. మొత్తంగా.. ఆ వీడియో మాత్రం కాస్త వైర‌ల్‌గా మారిపోయింది. ఆ దృశ్యాల‌ను చూసేందుకు కింది వీడియోను క్లిక్ చేయండి..