తెలంగాణలో రాజన్న రాజ్యమే లక్ష్యమంటూ వైఎస్సార్ తెలంగాణ పార్టీతో పేరు పార్టీ ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల.. వివిధ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తున్నారు.. ఇక, నిరుద్యోగ సమస్యలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన ఆమె.. నిరుద్యోగ దీక్షల పేరుతో వరుసగా దీక్షలు చేస్తూ వస్తున్నారు.. ఇకపై.. ప్రతీ మంగళవారం దీక్షలు చేయనున్నట్టు వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ ప్రకటించింది.. ఇక, ఇవాళ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామంలో నిరుద్యోగ దీక్ష చేపట్టనున్నారు. గ్రామంలో ఇటీవల ఉద్యోగం రాక శ్రీకాంత్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే కాగా.. శ్రీకాంత్ కుటుంబాన్ని పరామర్శించనున్న వైఎస్ షర్మిల.. ఆ తర్వాత దీక్ష చేపట్టనున్నారు.. ఆమె దీక్ష సాయంత్రం 5 గంటల వరకు కొనసాగించనున్నారు.
నేడు నల్గొండ జిల్లాలో షర్మిల నిరుద్యోగ దీక్ష

YS Sharmila