YS Sharmila: కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిలారెడ్డి తనయుడు వైఎస్ రాజారెడ్డికి జనవరి 18న నిశ్చితార్థం, ఫిబ్రవరి 17న పెళ్లి జరగనుండగా.. ఇందుకు షర్మిల కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతలను షర్మిల పెళ్లికి ఆహ్వానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని కాంగ్రెస్ నేత షర్మిల మర్యాద పూర్వకంగా కలిసారు. భట్టి అన్నా బాగున్నారా అంటూ ఆప్యాయంగా పలకరించారు. డిప్యూటీ సీఎం కావడం వెరీ వెరీ హ్యాపీగా ఉందంటూ కంగ్రట్యూలేషన్ అన్నారు. ఈ నెల 18న నా తనయుడు రాజారెడ్డి పెండ్లి కావున తప్పకుండా రావాలని వివాహ పత్రికను అందజేసి ఆహ్వానించారు.
Read also: Pragya Jaiswal: గులాబీ కలర్‌లో గుబాళిస్తున్న ప్రగ్యా జైస్వాల్
ఈనెల 18న షర్మిల తనయుడు రాజారెడ్డి, ప్రియల నిశ్చితార్థం, ఫిబ్రవరి 17వ తేదిన జరిగే పెండ్లికి రావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను షర్మిల ఆహ్వానించారు. అనంతరం ఇరువురు కాసేపు కూర్చొని మాట్లాడుకున్నారు. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసంలో వైఎస్ షర్మిల కలిశారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి కుటుంబ సమేతంగా రావాలని వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. అంతకు ముందు మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును ఆయన నివాసంలో షర్మిల కలిశారు. తన కుమారుడి వివాహానికి కుటుంబ సమేతంగా వచ్చి ఆశీర్వదించాలని కోరారు. కాగా.. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితరులను కలిసి ఇప్పటికే ఆహ్వానించిన విషయం తెలిసిందే..
Read also: Fake Calls Alert: *401# కాల్స్‌తో జాగ్రత్త! టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ హెచ్చరిక
ఇటీవల వైఎస్ఆర్టీపీ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం జీవితాంతం కష్టపడ్డారన్నారు. చివరి క్షణం వరకు పార్టీకి సేవ చేశారని గుర్తు చేశారు. ఆయన కూతురుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు.
Konathala Ramakrishna: జనసేన వైపు మాజీ మంత్రి చూపు..! త్వరలో పవన్ కల్యాణ్ భేటీ..!