Site icon NTV Telugu

తెలంగాణలో వైఎస్ తో లబ్ది పొందని ఇల్లే లేదు : షర్మిల

వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. తాజా మీడియా సమావేశంలో షర్మిల మాట్లాడుతూ… మన పార్టీలో కార్యకర్తలకే పెద్దపీట వేస్తాం. కార్యకర్తలే రేపటి ప్రజా నాయకులు. కార్యకర్తలు చెప్పిందే సిద్ధాంతం. అదే పార్టీ రాజ్యాంగం అని పేర్కొన్నారు. తెలంగాణలో వైఎస్ తో లబ్ది పొందని ఇల్లే లేదు అన్నారు. వైఎస్ సంక్షేమ పాలనను గుర్తు తెచ్చేలా… తెలంగాణ ఆకాంక్షలకు అద్దం పట్టేలా… పార్టీ ఎలా ఉండాలో కార్యకర్తలే చెప్పాలి. ప్రజలందరి భాగస్వామ్యం మనకు అవసరం. ప్రజల ఆశయాలకు అద్దం పట్టేలా మన విధానాలు ఉండాలి. రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరి కష్ట సుఖాలను కార్యకర్తలు తెలుసుకోవాలి. మన పార్టీ ప్రజల పార్టీ. ప్రతీ తెలంగాణ బిడ్డా మన ఎజెండా చూసి మెచ్చుకోవాలి. వైఎస్ ఆర్ కార్యకర్తలు ప్రతీ ఇంటికి వెళ్ళాలి. వారి వివరాలు, ఇష్టాలు, సమస్యలు తెలుసుకోవాలి. వాట్సాప్ నంబర్ లో మీ అభిప్రాయాలు చెప్పండి. ఇప్పటి కార్యకర్తలే రేపటి ప్రజా నాయకులు అని తెలిపారు.

Exit mobile version