NTV Telugu Site icon

YS Sharmila : సార్ వచ్చాడు..కట్ట మీద నిలబడి…పిట్ట కథలు చెప్పాడు

Ys Sharmila

Ys Sharmila

YSRTP Chief YS Sharmila Made comments on CM KCR
తెలంగాణలో ఇటీవల కురిసిన వర్షాలకు భద్రాచలంలో పలు గ్రామాలు నీట మునిగాయి. అయితే ఈ నేపథ్యంలో నేడు వరది ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పర్యటించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భద్రాచలం పట్టణానికి కరకట్ట ఎత్తు పెంచక పోవడమే వరదలకు కారణమని ఆరోపించారు. అంతేకాకుండా.. 8 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉండి ఎందుకు కరకట్ట ఎత్తు పెంచలేదు.
తక్షణం కరకట్ట ఎత్తు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. 25 అడుగుల ఎత్తులో వరదలు రావడం తో ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. వారం రోజులు వర్షం పడ్డాక గాలి మోటార్ లో కేసీఅర్ వచ్చాడు. వచ్చి ఒక్క కాలని తిరగలేదు. ఒక్కరినీ పరామర్శించింది లేదు. ముందుగా అప్రమత్తం చేయడం లో ప్రభుత్వం పూర్తిగా విఫలం. సహాయం ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. వైఎస్సార్ భద్రాచలం కరకట్ట పెంచాలి అనుకున్నారు. వైఎస్సార్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం…తర్వాత కేసీఅర్ సైతం పట్టించుకోలేదు. కేసీఅర్ కు భద్రాచలం మీద ఉన్న ప్రేమ ఏంటో అర్థం అవుతుంది.

 

సార్ వచ్చాడు..కట్ట మీద నిలబడి…పిట్ట కథలు చెప్పాడు. వరదలకు విదేశాలు కుట్రలు చేశాయట…క్లౌడ్ బరస్ట్ చేశారట. కేసీఅర్ తో పాటు ఆయన కంత్రి మంత్రి ఒకరు ఇలానే మాట్లాడుతున్నారు. పక్క రాష్ట్రం లో ఉన్న పోలవరం కారణం అంటాడు. పోలవరం కారణం అయితే ఇన్నేళ్ళు ఎందుకు మెచ్చుకున్నారు. ఇన్నేళ్ళు పోలవరం గురించి ఎందుకు మాట్లాడలేదు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని మీ ఇళ్లకు పిలుస్తారు… కౌగిలించుకున్నారు…స్వీట్ లు తినిపించారు కదా. అన్నాలు పెట్టుకున్నారు..అన్ని చేశారు…కానీ మాట్లాడుకోవడం తీరిక లేదా. అప్పుడు కనిపించలేదా పోలవరం ప్రాజెక్ట్ . తప్పించుకోవడానికి కారణం ఎందుకు వెతుకుతున్నారు. భద్రాచలం వరదలు కారణం కేసీఆర్. కరకట్ట ఎత్తు పెంచి ఉంటే ఈ పరిస్తితి వచ్చేది కాదు కదా. భద్రాచలం ప్రజలకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అంటూ ఆమె మండిపడ్డారు.