తెలంగాణ సీఎం కేసీఆర్ పై మరోసారి నిప్పులు చెరిగారు వైసీఆర్టీపీ పార్టీ అధినేత వైఎస్ షర్మిల. రైతుల కడుపు కొట్టి, బడులను బంద్ పెట్టి, బార్లకు “రండి బాబు .. రండి” అంటూ డోర్లు తెరుస్తున్నాడని… దీనిపై సీఎం కేసీఆర్ సిగ్గుపడాలని నిప్పులు చెరిగారు వైఎస్ షర్మిల. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి… ఇంటికో తాగుబోతుని తయారు చేస్తున్నాడని కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ షర్మిల. ఆదాయం పెంచుకొనే తెలివి లేక లిక్కర్ మీద రాష్ట్రాన్ని నడుపుతున్నందుకు నిజంగా సిగ్గుపడాలని నిప్పులు చెరిగారు.
”తాగుబోతోళ్ళ కష్టం మీకే బాగా తెలుసినట్లు.. గల్లీకో వైన్ షాప్, వీధికో బార్ షాప్, గ్రామానికో 10 బెల్ట్ షాపులు పెట్టి బంగారు తెలంగాణను బారుల తెలంగాణగా, బీరుల తెలంగాణగా మార్చారు దొరగారు. ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి లిక్కర్ షాపులను పెంచడంలో డ్రగ్స్ అమ్మడంలో మాత్రమే కనిపిస్తుంది” అంటూ ట్వీట్ చేశారు వైఎస్ షర్మిల.
