NTV Telugu Site icon

కరోనా విలయం : షర్మిల సంచలన ప్రకటన..

తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ప్రతి రోజు 4 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా తెలంగాణలో కొత్తగా 4,305 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,20,709 కి చేరింది. కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో.. వైఎస్ షర్మిల సంచలన ప్రకటన చేశారు. కరోనా బాధితులను అదుకునేందుకు “ఆపదలో తోడుగా YSSR”అనే కార్యక్రమాన్ని తీసుకొస్తున్నట్లు షర్మిల పేర్కొన్నారు. “తెలంగాణ ఆడబిడ్డలారా.. ధైర్యం కోల్పోకండి. మీ కాళ్ళ మీద మీరు నిలబడటానికి .. మళ్ళి మీ జీవితం సాఫీగా సాగేందుకు..మీరంతా మన YSR కుటుంబసభ్యులుగా భావించి ..నా వంతుగా మీకు ఏదైనా సహాయం చేయాలనుకొంటున్నాను. మన “ఆపదలో తోడుగా YSSR టీం” ఫొన్ నంబరు 040-48213268 కు మీ సమాచారాన్ని తెలియజేయండి తమ కుటుంబాలకు ఆర్థిక అండగా నిలిచే ఎంతోమంది ఈ కరోనా బారిన పడి చనిపోయారు. కుటుంబ పెద్దదిక్కు తండ్రి / భర్త / కొడుకును కరోనాకు కోల్పోయి కుటుంబాన్ని నెట్టలేక నిరాశ, నిస్పృహలతో కృంగిపోతున్న మహిళల బాధను కాస్తైనా పంచుకోవాలని “ఆపదలో తోడుగా YSSR టీం” ఏర్పాటు చేస్తున్నాను” అంటూ షర్మిల తెలిపారు.