Site icon NTV Telugu

Kishan Reddy: సంత్ సేవాలాల్ చూపిన బాటలో యువత నడవాలి..

Kishanreddy

Kishanreddy

Kishan Reddy: నేటి యువత సంత్ సేవాలాల్ చూపిన బాటలో నడవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ. కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సంత్ సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల అర్పించారు. సంత్ సేవాలాల్ జయంతిని దేశ వ్యాప్తంగా బీజేపీ వైభవంగా నిర్వహిస్తోందన్నారు. బ్రిటిష్ వారు అధికార దుర్వినియోగంతో మత మార్పిడులకు పాల్పడ్డారని తెలిపారు. బ్రిటిష్ మత మార్పిడులకు వ్యతిరేకంగా సంత్ సేవాలాల్ పోరాటం చేశారని గుర్తు చేశారు.

Read also: Redmi A3 Price: భారత మార్కెట్‌లోకి రెడ్‌మీ ఏ3 స్మార్ట్‌ఫోన్‌.. ధర, ఫీచర్లు ఇవే!

సాంఘీక దురాచారాలను రూపు మాపెందుకు అనేక సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. నేటి యువత సంత్ సేవాలాల్ చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. సంతు సేవాలాల్ తెలుగు రాష్ట్రాల్లో జన్మించి.. ఉద్యమాన్ని ప్రారంభించారని అన్నారు. బంజారా సమాజం యొక్క హక్కులు, ఆర్థిక స్వావలంబన కోసం బీజేపీ పని చేస్తుందన్నారు. ఆదివాసీ గ్రామాల్లో అభివృద్ధి కోసం కార్యాచరణ రూపొందించామన్నారు. బంజారా సమాజం యొక్క అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Read also: Sonia Gandhi : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయను.. రాయ్‌బరేలీ ప్రజలకు సోనియా భావోద్వేగంతో లేఖ

మల్లన్న భక్తుల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం కొమురవెల్లిలో నిర్మించిన రైల్వేస్టేషన్‌కు గురువారం శంకుస్థాపన చేయనున్నారు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి. ఈయనతో పాటు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ కూడా హాజరుకానున్నారు. ఈ మార్గంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవలే కొత్త రైలు మార్గాన్ని మంజూరు చేసింది. పనులు కూడా పూర్తయ్యాయి.
TS Polycet 2024: తెలంగాణ పాలిసెట్ నోటిఫికేషన్ విడుదల.. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

Exit mobile version