TRS MLA Rasamayi Balakishan: కరీంనగర్ జిల్లా మానకొండూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయికి చేదు అనుభవం ఎదురైంది. తన కాన్వయ్ పై యువకుల దాడి చేసిన సంఘటన సంచలనంగా మారింది. యువజన సంఘాల నాయకులు డబల్ రోడ్డు నిర్మాణం చేయాలని ధర్నా చేపట్టారు. ధర్నాకు సంఘీభావం తెలిపేందుకుగన్నేరువరం మండలం గుండ్లపల్లిలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ వెళ్లారు.
దీంతో ఒక్కసారిగా యువకులు ఆయన కాన్వాయ్ పై దాడి చేశారు. రోడ్డు నిర్మాణం తక్షణమే చేపట్టాలని దాడికి దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. యువజన సంఘనాయకులు ఒక్కసారిగా కాన్వాయ్ పై రావడంతో.. డ్రైవర్ ముందుకు తీసుకువెళ్లాడు. పోలీసులు ఎంట్రో ఇచ్చి యువకులపై లాఠీఛార్జ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తతనెలకొంది. కవ్వంపల్లి తో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే కాన్వాయ్ పై అక్కడున్న యువకులు మొత్తం ఒక్కసారిగా దూసుకురావడంతో.. కొందపడి చాలామందికి గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన యువకును పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఉద్రికత్తం పరిస్థితి ఇంకా వేడక్కే అవకాశం ఉన్నందున పోలీసులు ఎమ్మెల్యే రసమయిని అక్కడనుంచి పంపివేశారు.
Ban on Child Birth: ఆ గ్రామంలో పిల్లలను కనడం నిషేధం.. ఎందుకో తెలుసా?