NTV Telugu Site icon

Boys Hostel: ఇంటి పక్కనే బాయ్స్‌ హాస్టల్‌.. మహిళ స్నానం చేస్తుండగా వీడియో

Boys Hostel

Boys Hostel

Boys Hostel: మహిళలు బయటకు వెళ్లే సమయంలోనే కాకుండా ఇంట్లో కూడా లైంగిక వేధింపులు సర్వసాధారణం. చివరకు ఇంట్లో స్నానం చేసేందుకు కూడా మహిళలు భయపడే పరిస్థితి నెలకొంది. ఎక్కడి నుంచో ఎవరు చూస్తున్నారో కెమెరాలో ఎవరు రికార్డింగ్ చేస్తారోనని మహిళలు భయపడుతున్నారు. తమ భయాన్ని నిజం చేసేందుకు కొందరు ఆకతాయిలు అమానుషంగా వ్యవహరిస్తున్నారు. ఓ మహిళ స్నానం చేస్తుండగా ఓ యువకుడు వీడియో తీసిన ఘటన ఎస్సార్ నగర్ లో చోటుచేసుకుంది.

Read also: Tea History: బుద్ధుడి కనురెప్పలతో తేయాకు మొక్కలు! టీకి పెద్ద కథే ఉందిగా?

హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్‌లోని ఓ ఇంట్లో ఓ మహిళ కుటుంబంతో కలిసి నివసిస్తోంది. కానీ ఆ ఇంటి పక్కనే బాయ్స్ హాస్టల్ ఉంది. ఈ హాస్టల్‌లోని ఓ యువకుడి కన్ను ఆ ఇంటి మహిళపై పడింది. ఈ క్రమంలో యువతి స్నానం చేస్తుండగా యువకుడు దొంగచాటుగా ఇంట్లోని బాత్ రూంలోకి వెళ్లి వీడియో తీశాడు. కొన్నాళ్లుగా ఈ దుర్మార్గం చేస్తుండగా.. తాజాగా అతడి ఆగడాలు బయటపడింది. బాత్‌రూమ్‌లో స్నానం చేస్తుండగా కిటికీని ఎవరో తట్టడం ఆ మహిళ గమనించింది. ఆమె పెద్దగా కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల ఇళ్లవారందరూ గుమిగూడారు. అదే సమయంలో అనుమానాస్పదంగా ఆ ఇంటి నుంచి పారిపోతున్న యువకుడిని స్థానికులు పట్టుకున్నారు. తాను స్నానం చేస్తుండగా ఎవరో వీడియో తీశారని యువతి చెప్పడంతో యువకుడు తన మొబైల్‌ను చెక్ చేశాడు. అందులో ఓ మహిళ వీడియో ఉండడంతో యువకుడికి దేహశుద్ధి చేశారు. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు యువకుడిని అరెస్టు చేసి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. యువకుడిపై ఎస్సార్ నగర్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇళ్ల వద్ద బాయ్స్ హాస్టల్ తీసి వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎలా హాస్టల్లు పెడతారని, ఎవరు పర్మీషన్ ఇస్తారని మండిపడుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే బాయ్స్ హాస్టల్ ను తొలగించాలని కోరుతున్నారు.
MLA Prasanna Kumar: పవన్ ఎన్ని సభలు పెట్టి వైసీపీని తిట్టినా.. మళ్లీ మేమే గెలుస్తాం

Show comments