NTV Telugu Site icon

Love Marriage: ప్రేమించి పెళ్లిచేసుకున్న యువకుడిపై యువతి పేరెంట్స్‌ దాడి..

Hyderabad Love Story

Hyderabad Love Story

Love Marriage: కూతురును ప్రేమ వివాహం చేసుకున్న యువకుడి పై యువతి పేరెంట్స్ దాడి చేసిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఏడాది క్రితం అబ్దుల్ సాహెల్, ప్రియురాలు ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అయితే యువతి బంధువులు యువతి మైనర్ అని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ప్రియుడు సాహెల్ లను అదుపులో తీసుకున్నారు. జైలు శిక్ష అనుభవించిన సాహెల్.. కొద్దిరోజుల క్రితమే బయటకు వచ్చాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత యువతికి దూరంగా ఉంటున్నాడు. అయితే యువతి పేరెంట్స్ సాహెల్ బయటకు రావడంతో.. అతనిపై కోపం పెంచుకున్నారు. అతనిని ఎలాగైనా దాడి చేయాలని పన్నాగం పన్నారు. దీనిలో భాగంగానే.. అతనికి కొడుకు పుట్టాడని.. చూడటానికి ఇంటికి రావాలని ప్రియురాలితో బలవంతంగా ఫోన్ చేయించారు యువతి పేరెంట్స్.

Read also: Manamey : శర్వానంద్ ‘మనమే’ రిలీజ్ డేట్ పై స్పెషల్ అప్డేట్ వైరల్..

ప్రియురాలి మాటలు నమ్మిన సాహెల్ ఇంటికి వచ్చాడు. సాహెల్ ఒక్కడే ఉండటంతో యువతి పేరెంట్స్ అతనిని బంధించారు. సాహెల్ పై తీవ్రంగా దాడి చేశారు. దీంతో సాహెల్ తకు గాయమై రక్తం రావడంతో భయంతో సాహెల్ అక్కడే వున్న ఓ గదిలోకి వెళ్ళి తలదాచుకున్నాడు. తనపై దాడి చేస్తున్నారు.. కాపాడండి అంటూ సెల్ఫీ వీడియోను పోలీసులు పంపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. యువకుడిని కాపాడేందుకు యువతి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా యువతి పేరెంట్స్ లోనికి అనుమతించలేదు. అయితే పోలీసులు బలవంతంగా ఇంటి లోపలికి ప్రవేశించి సాహెల్ ను బయటకు తీసుకుని వచ్చారు. అతని ప్రాణాలు కాపాడారు. సాహెల్ కు రక్తం కారుతుండటంతో హుటా హుటిన ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Papua New Guinea: పాపువా న్యూ గినియాలో విరిగిపడిన కొండచరియలు.. 100 మంది మృతి