Site icon NTV Telugu

Yogi Adityanath: పరీక్షలు సరిగ్గా నిర్వహించలేని వాడు.. ప్రభుత్వం ఏం నడుపుతాడు..!

Yogi Adityanand

Yogi Adityanand

Yogi Adityanath: పరీక్షలు సరిగ్గా నిర్వహించలేని వాడు.. ప్రభుత్వం ఏం నడుపుతాడు అంటూ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాధ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోమరంభీం జిల్లా కాగజ్‌నగర్‌ లో బీజేపీ రామరాజ్య స్దాపన సంకల్ప సభలో జై శ్రీరాం జై తెలంగాణ నినాదాలతో యోగీ ప్రసంగం ప్రారంభించారు. సోదరి సోదర మనుల్లారా నా నమష్కారం అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. మీతో మాట్లాటం చాలా ఆనందంగా ఉందన్నారు. కేవలం ముస్లింల కోసమే ఈ ప్రభుత్వం పని చేస్తోందని మండిపడ్డారు. నీళ్ళు, నిధులు, నియామకాల కోసం ఎర్పాటు అయిన తెలంగాణ ఇప్పుడు అప్పుల్లో కూరుకుపోయిందన్నారు.

Read also: Priyanka Gandhi: బీఆర్ఎస్ ను తప్పించండి.. కాంగ్రెస్ ను తీసుకుని రండి.. ఉద్యోగాలు పొందండి..

ఉత్తరప్రదేశ్ లో డబుల్ ఇంజన్ సర్కార్ పని చేస్తోంది.. అక్కడ అధ్బుతంగా ఉందని తెలిపారు. ఇక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షలు సరిగ్గా నిర్వహించలేని వాడు ప్రభుత్వం ఏం నడుపుతాడు? అంటూ ప్రశ్నించారు. ఎంఐఎం, బీఆర్ఎస్ కు కామన్ ఫ్రెండ్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఉంటే ఫ్రిగా కరోనా వాక్షిన్, ఉచితంగా బియ్యం ఇచ్చే వారు కాదని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే అయోధ్యలో రామమందిర్ కట్టే వారా? అని ప్రశ్నించారు. బీఅర్ఎస్, బీఎస్పీ దోస్తులే.. ఓట్లు చీల్చేందుకు బీఎస్పీ రంగంలోకి దిగిందని మండిపడ్డారు. బీజేపీనీ గెలిపిస్తాం… బంగారు తెలంగాణ సాధిస్తాం అంటూ తెలుగులో యోగీ తెలిపారు.
Priyanka Gandhi: బీఆర్ఎస్ ను తప్పించండి.. కాంగ్రెస్ ను తీసుకుని రండి.. ఉద్యోగాలు పొందండి..

Exit mobile version