NTV Telugu Site icon

Yadadri : యాదాద్రికి పెరిగిన భక్తుల రద్దీ.. భారీగా పెరిగిన స్వామివారి ఆదాయం..

Yadadri Bhakthulu

Yadadri Bhakthulu

తెలంగాణలో కొలువై ఉన్న మహిమాన్విత దేవుడు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకోవడం కోసం భక్తులు దేశ, విదేశాల నుంచి భక్తులు వస్తున్నారు.. ఆలయంలో భక్తిశ్రద్ధలతో పూజలుచేసిన అనంతరం అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.. గురు,శుక్రవారాల్లో భక్తుల రద్దీ భారీగా పెరిగినట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు.. అంతేకాదు భక్తుల రద్దీతో స్వామివారి ఆదాయం రూ. 46,65,974 సమకూరిందని ఆలయ ఈవో తెలిపారు..

తాజాగా ఈ రెండు రోజుల్లో పెరిగిన ఆదాయం వివరాలను ఆలయ అధికారులు తెలిపారు.. ఆ వివరాలను ఒకసారి తెలుసుకుందాం.. బుకింగ్ ద్వారా రూ. 1,06000, కైంకర్యముల ద్వారా రూ. 800, సుప్రభాతం ద్వారా రూ. 6,100, బ్రేక్ దర్శనం ద్వారా రూ. 1,60,200, వ్రతాల ద్వారా రూ. 1,16,000 ఆదాయం వచ్చిందని వివరించారు. అదే విధంగా వాహన పూజల ద్వారా రూ. 6,100 , వ్రత కైంకర్యాల ద్వారా రూ. 1,200, వీఐపీ(VIP) దర్శనం ద్వారా రూ. 1,20,000, ప్రచారశాఖ ద్వారా రూ. 50,400, పాతగుట్ట ద్వారా రూ. 32,320, కొండపైకి వాహనాల ప్రవేశం ద్వారా రూ. 3,00,000, యాదఋషి నిలయం ద్వారా రూ. 62,874 వచ్చిందని వెల్లడించారు..

ప్రసాదవిక్రయం ద్వారా రూ. 11,20,900, శాశ్వత పూజల ద్వారా రూ. 10,000, కల్యాణ కట్ట ద్వారా రూ. 66,000, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. 90,800, శివాలయం ద్వారా రూ. 8000, పుష్కరిణీ ద్వారా రూ. 1,600, మిగిలిన వాటి ద్వారా రూ. 57,200, లీగల్ లిజస్ ద్వారా రూ. 23,28,572, అన్నదానం ద్వారా రూ. 20,908 వరకు ఒక్కరోజులోనే ఆదాయం వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.. ఇక ఈ మూడు రోజులు ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు..