Site icon NTV Telugu

Yadagirigutta: యాదగిరిగుట్టలో భక్తులకు షాక్.. వ్రతం టికెట్ ధరలు భారీగా పెంపు..

Yadagiri

Yadagiri

Yadagirigutta: తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం కోసం నిత్యం వేల మంది భక్తులు తరలి వస్తుంటారు. ఇక, పండుగలు, ప్రత్యేక పర్వదినాలు, వీకెండ్స్‌లో యాదగిరిగుట్టలో రద్దీ భారీగా ఉంటుంది. అయితే, యాదాద్రి ఆలయానికి వచ్చే భక్తుల్లో ఎక్కువ మంది ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక, ఈ క్రమంలో ఆలయ దేవస్థానం అధికారులు నరసింహస్వామి భక్తులకు షాక్ ఇచ్చారు. వ్రతం టికెట్ ధరను భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు.

Read Also: Air India Plane: లండన్‌ వెళ్తూ.. వెనక్కి వచ్చేసిన ఎయిర్‌ ఇండియా విమానం!

అయితే, యాదగిరిగుట్ట దేవాలయంలో నిర్వహించే సత్యనారాయణ స్వామి వ్రతం టికెట్‌‌‌‌‌‌‌‌ ధరలను పెంచుతూ ఈవో వెంకట్‌‌‌‌‌‌‌‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు యాదాద్రిలో వ్రతం టికెట్ ధర రూ. 800గా ఉండగా.. దాన్ని ఇప్పుడు రూ. 1000కి పెంచారు. కాగా, సత్యనారాయణ స్వామి వ్రతం విషయానికి వస్తే.. అన్నవరం తర్వాత ఎక్కువగా యాదగిరిగుట్టలోనే వ్రతాలు చేయించుకుంటారు. ఇప్పుడీ టికెట్ రేటు పెంచడంతో భక్తులకు షాక్ అనే చెప్పాలి. ఇక, ఇప్పటివరకు టికెట్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటే.. భక్తులకు పూజా సామగ్రిని ఇచ్చేవారు.. ఇక, ఇప్పటి నుంచి ఈ టికెట్ మీద భక్తులకు పూజ సామగ్రితో పాటుగా స్వామివారి శేష వస్త్రాలు అలాగే, సత్యనారాయణస్వామి విగ్రహ ప్రతిమ కూడా అందజేయనున్నారు. పెరిగిన టికెట్ ధరలు ఇవాళ్టి నుంచే అమల్లోకి రానున్నాయి.

Exit mobile version