NTV Telugu Site icon

Yadadri Road Accident: చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు స్పాట్ డెడ్..

Yadadri Road Accident

Yadadri Road Accident

Yadadri Road Accident: కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్‌పూర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున 4.30 గంటలకు జరిగింది. చెరువులో కారు మునిగిపోవడంతో ఐదుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులు హైదరాబాద్ ఎల్బీనగర్‌లోని ఆర్టీసీ కాలనీకి చెందిన హర్ష, దినేష్, వంశీ, బాలు, వినయ్‌లుగా గుర్తించారు. మృతదేహాలను భువనగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Read also: South Korea President: నన్ను క్షమించండి.. మరోసారి దేశంలో ఎమర్జెన్సీ విధించను!

అయితే.. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు యువకులు ఉన్నారు. మణికంఠ యాదవ్ అనే వ్యక్తి కారు అద్దాలు పగులగొట్టి సురక్షితంగా బయటపడ్డాడు. హైదరాబాద్ నుంచి భూదాన్ పోచంపల్లి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులంతా 20 నుంచి 21 ఏళ్లలోపు వారే. శుక్రవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. మద్యం మత్తులో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై భూదాన్ పోచంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read also: Urjaveer : ఇవాళ ఉర్జవీర్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

మరోవైపు కల్లూరు మండలం రామకృష్ణపురం వద్ద జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఆర్టీస్సీ బస్సు ఢీ,బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ఆర్టీసీ బస్సులో 26 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కొత్తగూడెం డిపో ఆర్టీసి బస్సు హైదరాబాదు నుండి కొత్తగూడెం వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ప్లేవుడ్ లారీ జాతీయ రహదారి పై నిలపటంతోనే ప్రమాదం చోటు చేసుకుంది.
Top Headlines @9AM : టాప్ న్యూస్