NTV Telugu Site icon

CM Revanth Reddy: మాడవీధుల్లో గండ దీపం వద్ద దీపారాధన.. సీఎంకు పూర్ణ కుంభ స్వాగతం

Yadagirigutta Cm Revanth Reddy

Yadagirigutta Cm Revanth Reddy

CM Revanth Reddy: యాదగిరిగుట్టకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. యాదాద్రి జిల్లా లోని పుష్కరిణి నుండి తూర్పు రాజగోపురం వరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు నడుచుకుంటూ వచ్చారు. మాడవీధుల్లో గండ దీపం వద్ద సీఎం, మంత్రులు దీపారాధన చేశారు. తూర్పు రాజగోపురం వద్ద ఆలయ అర్చకులు సీఎంకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. తూర్పు రాజగోపురం నుండి ప్రవేశించిన అనంతరం త్రితల గోపురం గుండా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఆలయంలోకి ప్రవేశించారు. అనంతరం ఆంజనేయ స్వామి వారి దర్శించుకున్నారు. ప్రధానాలయంలోకి వెళ్లారు. ప్రధానాలయంలో సువర్ణ పుష్పర్చనలో పాల్గొన్నారు. సహస్ర సువర్ణ పుష్పార్చనలో సీఎం రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సహస్ర పుష్పార్చన పూర్తి అనంతరం వేద పండితులు సీఎం, మంత్రులకు వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ కలిసి సీఎంకు స్వామి ప్రతిమను అందజేశారు.

Read also: Hyderabad: పంజాగుట్టలో కారు బీభత్సం.. చెకింగ్ చేస్తుండా హోం గార్డు ఈడ్చుకెళ్ళిన డ్రైవర్‌

అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆలయ అభివృద్ధి పనులపై వీటీడీఏ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 నుంచి 1.30 వరకు భోజనం. 1.30 గంటలకు వలిగొండ మండలం సంగెం ప్రెసిడెన్షియల్ సూట్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరుతారు. మధ్యాహ్నం 2.10 నుంచి 3 గంటల వరకు బిమలింగం వద్ద పూజల్లో పాల్గొని నడక సాగిస్తారు. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు రెండున్నర కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టనున్నారు. 4.30 గంటలకు ధర్మారెడ్డి కాలువ మీదుగా సంగెం-నాగిరెడ్డిపల్లి ప్రధాన రహదారికి చేరుకుంటారు. అనంతరం సాయంత్రం 4.30 నుంచి 5 గంటల వరకు నాగిరెడ్డిపల్లిలో వాహనంపై నుంచి ప్రజలనుద్దేశించి సీఎం ప్రసంగిస్తారు. సాయంత్రం 5 గంటలకు సంగెం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరుతారు.

Kethireddy Venkatram Reddy: కబ్జా నోటీసులపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి.. దీని వెనుక రాజకీయ కోణం..!

Show comments