NTV Telugu Site icon

World Meditation Day : హైటెక్స్‌లో ప్రపంచ ధ్యాన దినోత్సవ వేడుకలు..

Meditation

Meditation

ధ్యానం మనసు ప్రశాంతతను, శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అయితే ప్రతి రోజు ధ్యానం చేయడం ఎంతో అవసరం అంటున్నారు వైద్యులు. మతాలతో సంబంధం లేకుండా.. అన్ని మతాలలో ముఖ్యంగా బౌద్దమతంలో ధ్యానంకు ప్రాముఖ్యత ఎక్కువగా కనిపిస్తోంది. ఎన్నో చెడు అలవాట్లను సైతం ధ్యానం ద్వారా దూరం చేసుకోవచ్చు. మానసిక ఒత్తిడి నుంచి బయట పడేందుకు ప్రతి రోజూ ధ్యానం చేయడం తప్పనిసరి అని చెప్పవచ్చు. అంతేకాకుండా.. మానసిక ఒత్తిడి నుంచి బయటపడి ఎంతో ఆనందంగా జీవించడానికి ధ్యానం ఎంతగానో ఉపయోగపడుతుంది.

అయితే.. నేడు ప్రపంచ ధ్యానం దినోత్సవంను పురస్కరించుకోని హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ప్రపంచ ధ్యాన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలను కిడ్స్‌ ఫేయిర్‌, స్టోర్ట్‌ ఎక్స్‌పో ఆధ్వర్యంలో చేపట్టారు. అయితే ఈ వేడుకల్లో.. ధ్యానం ప్రాముఖ్యత, ధాన్యం చేయడం వల్ల కలిగే ఉపయోగాల గురించి వివరించనున్నారు. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో.. ఎంతో ఒత్తిడికి లోనవుతుంటాం, ఆఫీసుల్లో, రోజు వారీ కార్యాకలాపాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటుంటాం. అయితే అలాంటి ఒత్తిడిలను దూరం చేసుకునేందుకు ధ్యానం సులువైన మార్గం.