Site icon NTV Telugu

Moosapet: పని కాడ ఇబ్బంది పెడుతున్నారు.. కుమారుడికి మెసేజ్ చేసి తల్లి ఆత్మహత్య

Kukatpalli Susaid

Kukatpalli Susaid

Moosapet: కూకట్‌పల్లిలో దారణం చోటుచేసుకుంది. పనిచేసే చోట కొందరు ఇబ్బంది పెడుతుండటంతో భరించలేక ఓ మహిళ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. మృతురాలు రమణమ్మగా గుర్తించారు పోలీసులు.

మృతురాలు రమణమ్మ(50) గత ఐదు సంవత్సరాలుగా మూసాపేట వై జంక్షన్ లో గల చెన్నై సిల్క్స్ షాపింగ్ మాలులో హౌస్ కీపింగ్ ఉద్యోగిగా పని చేస్తుంది. ఈ రోజు ఉదయం విధులకు హాజరైన రమణమ్మ, తాను పని చేయాల్సిన రెండవ అంతస్తులో కాకుండా, బిల్డింగ్ పైకి ఎక్కి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు పాల్పడే ముందు రమణమ్మ తనను పని చేసే చోట కొందరు ఇబ్బందులకి గురి చేస్తున్నారని తన కుమారుడికి ఆడియో మెసేజ్ పంపించి ఆత్మహత్యకు పాల్పడింది. అది విన్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. తల్లి ఫోన్ కు కాల్ చేస్తే.. లిప్ట్ చేయాలేదు. దీంతో కంగారుపడ్డ కుటుంబసభ్యులు పరుగున షాపింగ్ మాల్ దగ్గరకు వచ్చే సరికి జరగరానిది జరిగిపోయింది. తల్లి బిల్డింగ్ పై నుంచి కిందికి దూకి అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. షాపింగ్ మాల్ పోలీసులకు సమచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Read also: Vishwambhara: విశ్వంభర షూట్ లో జాయినైన త్రిష…

మృతురాలు ఆత్మహత్యకు కారణమైన వారి పై చర్యలు తీసుకోని న్యాయం చేయాలని మృతురాలి బంధువులు షాపింగ్ మాల్ ఎదురుగా ఆందోళన చేపట్టారు. తల్లి ఎప్పుడు తన బాధను మాతో చెప్పుకోలేదని, విషయం చెప్పివుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదంటూ వాపోతున్నారు బంధువులు, పెద్దదిక్కైన తల్లి మమ్మల్ని వదిలిపోయిందని కన్నీరుమున్నీరవుతున్నారు. తల్లిపై ఆరోపణలు చేయడం వల్లే అది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని మండిపడుతున్నారు. వస్తాను జాగ్రత్త అంటూ ఇవాల ఉదయం పనికోసం బయటకు వచ్చిన తల్లి కానరాని లోకానికి వెళ్లిపోయిందని వాపోతున్నారు. తల్లి ఆత్మహత్యకు కారకులైన వారిని వదిలే ప్రసక్తే లేదని, న్యాయం జరిగేంతవరకు షాపింగ్ మాల్ నుంచి కదిలేది లేదని కూర్చున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Vishwambhara: విశ్వంభర షూట్ లో జాయినైన త్రిష…

Exit mobile version