Software Engineer Suicide: రంగారెడ్డి జిల్లా అత్తాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రియుడి చేతిలో మోసపోయాననే మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. అత్తాపూర్‌కు చెందిన ఓ యువతి స్థానికంగా ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. తన ఫ్లాట్‌లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే ప్లాట్ ఉన్న వ్యక్తులు ఎంతసేపు తలుపు కొట్టిన ఆమె స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. అయితే అప్పటికే యువతి ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. ఆ యువతి మృతదేహాన్ని కిందకుదించి పరిశీలించారు. అనంతరం యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మృతి చెందిన యువతి అదితి భరద్వాజ్‌గా గుర్తించారు. ఇదిలా ఉండగా మృతి చెందిన యువతి ఓ యువకుడిని ప్రేమించిందని, అయితే కొద్దిరోజులుగా సదరు వ్యక్తి ఆమెను దూరం పెట్టడం మొదలు పెట్టడంతో ఆమె తీవ్రంగా బాధపడేదని వెల్లడైందని పోలీసులు తెలిపారు. ఆ యువకున్ని ఎందుకని అడిగినా సమాధానం చెప్పకుండా తప్పించుకుని తిరిగాడని సమాచారం. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో యువకుడు ద్వారా మోసపోయానని గ్రహించిన ఆ యువతి.. కుంగిపోయింది. చివరకు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది. కాగా.. అదితిని ప్రేమించిన వ్యక్తి ఎవరు? ఎక్కడ ఉంటున్నాడు? అదితి చేసే ఆఫీసులోనే అతను పనిచేస్తున్నాడా? అనేకోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Read also: Fake Passport Scam: నకిలీ పాస్ పోర్టు స్కామ్.. పోలీస్ అధికారుల పాత్ర ఉన్నట్లు గుర్తించిన సిఐడి
అయితే.. మరో ఘటనలో నిమ్స్ ఆస్పత్రిలోని ఓ వ్యక్తి భవనం పై అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దూకిన వ్యక్తిని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బుచ్చయ్యగా గుర్తించారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వై.లక్ష్మాపురం గ్రామానికి చెందిన బుచ్చయ్య అనారోగ్యంతో పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రిలో చేరాడు. ఈ నెల 16న కుటుంబీకులు చికిత్స నిమిత్తం గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో చేరి శస్త్ర చికిత్స చేశారు. అయితే, శస్త్రచికిత్స తర్వాత కూడా అతని ఆరోగ్యం మెరుగుపడలేదు. దీంతో మనస్తాపం చెందిన బుచ్చయ్య ఆస్పత్రిలోని స్పెషాలిటీ బ్లాక్‌పై నుంచి దూకాడు. ఇది గమనించిన సిబ్బంది అతడిని అత్యవసర విభాగానికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు కడుపునొప్పి తట్టుకోలేక తండ్రి రెండు అంతస్తుల నుంచి దూకినట్లు మృతుడి కుమారుడు తెలిపాడు.
Top Headlines@1PM: టాప్ న్యూస్
