Site icon NTV Telugu

ప్రమాదంలో గాయపడిన మహిళా కానిస్టేబుల్‌ మృతి

గత నెల 12వ తేదిన విధులు ముగించుకోని ఇంటికి తిరిగివస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు గాయపడిన ఓ మహిళా కానిస్టేబుల్‌ చికిత్స పొందుతూ మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. జవహార్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ లో కానిస్టేబుల్‌ గా విధులు నిర్వహిస్తున్న జ్యోత్స్న (23)అనే మహిళ కానిస్టేబుల్‌ సెప్టెంబర్‌ 12న విధులు ముగించుకొని తన ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలు దేరింది.

అయితే మల్కాజిగిరి పోలీస్ స్టేషన్‌ పరిధిలోని మౌలాలి ఫ్లైఓవర్‌ పైకి రాగానే అనుకోకుండా జ్యోత్స్న నడుపుతున్న స్కూటీలో మంటలు చెలరేగాయి. దీంతో జ్యోత్సకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు తీవ్రంగా గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం యశోద ఆసుపత్రికి తరలించారు. దాదాపు నెల రోజుల నుంచి చికిత్స పొందుతున్న జ్యోత్స్న గురువారం మృతి చెందింది.

Exit mobile version