Site icon NTV Telugu

Wife Offers Supari To Kill Husband: సుపారి ఇచ్చి భర్త హత్య.. భార్యని పట్టించిన కాల్ డేటా

Wife Offers Supari To Kill Husband

Wife Offers Supari To Kill Husband

Wife Offers Supari To Kill Husband: అక్రమ సంబంధాలు పచ్చని సంసారంలో చిచ్చుపెడుతున్నాయి. క్షణికావేశంలో ఏం చేస్తున్నారో, ఎవరిని కోల్పోతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. అక్రమ సంబధాల బాటలో పడి పిల్లలు వున్నారనే సంగతి కూడా పట్టించుకోవడంలేదు. ఆ పిల్లల పరిస్థి ఏమవుతుంది అని కూడా గమనించలేక పోతున్నారు. చివరకు భార్య భర్తలు విడపోవడమో లేక ఒకనొకరు చంపుకోవడానికైనా వెనుకాడని వ్యామోహంలో పడి జీవితాలను జైలుపాలు చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. అక్రమ సంబంధంతో భర్తను సుపారి ఇచ్చి మరీ హత్య చేయించింది ఓ భార్య. ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన సంచటనంగా మారింది. మిర్యాలగూడ మండలం తుంగపాడు లావుడి తండాకి చెందిన ధారవత్ రాగ్యకు పెద్దఊర మండలంకు చెందిన రోజాతో 2010లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు వున్నారు. మూడేళ్లుగా హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్నారు. వీరద్దరి జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో అక్కడే వరుసకు బావ అయిన లకపతితో భార్య పరిచయం ఏర్పడింది. చివరకు అది వివాహేతర సంబందానికి దారితీసింది. ఈవిషయం కాస్త భర్తకు తెలియడంతో భార్య భర్తల మధ్య ఘర్షణకు తావులేపింది. భర్త నిలదీయడంతో.. కోపంతో ఊగిపోయిన భార్య. భర్తకు చంపేందుకు ప్లాన్‌ వేసింది.

నల్గొండ జిల్లా నెరేడుగొమ్మ మండలంలోని బుగ్గతాండ కు చెందిన మాన్సింగ్, బాలాజీలకు 20 లక్షలతో సుపారి ఇచ్చి భర్త హత్యకు లక్ పతితో ఒప్పందం కుదుర్చుకుంది. గతంలో.. ఆగస్టు 19న హైదరాబాద్ నగర శివారులో భర్త రాగ్యను మద్యం తాగించి హత్య చేయించింది. ఎవరికి తెలియకుండా.. నెరేడుగొమ్మ మండలం కాసరాజపల్లి పుష్కరఘాట్ సమీపంలో కృష్ణా నదిలో రాగ్య మృతదేహాన్ని సుపారితీసుకున్న నిందితులు పడేసారు. భార్య కదలికలో మార్పు గమనించిన రాగ్య తల్లిదండ్రులు భార్య రోజాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ పోలీసులు విచరాణలో షాకింగ్‌ విషయాలు బయట పడ్డాయి. విచారలో భాగంగా.. భార్య ఫోన్ కాల్ డేటాను సేకరించగా.. పోలీసులు నిర్ఘాంతపోయే ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. భర్త రాగ్యను భార్య రోజానే సుపారీ ఇచ్చి హత్య చేయించిందని తేల్చారు. అయితే.. రాగ్య మృతదేహం కోసం రెండు రోజులుగా గజ ఈతగాళ్లతో కృష్ణా నదిలో పోలీసులు వెతుకుతున్నా.. ఇంకా ఆచూకీ లభించలేదని పోలీసులు తెలిపారు.
Hyderabad IIT: వరుసగా రెండో ఘటన.. మరో విద్యార్థి లాడ్జిపై నుంచి దూకి…

Exit mobile version