Wife Eloped With Husband Friend In Hyderabad: తన భర్తను ఫంక్షన్‌ను పంపించి, ప్రియుడితో భార్య పారిపోయిన సంఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ప్రశాంత్, తేజస్వినీలకు 2020 నవంబర్‌లో పెళ్లయ్యింది. ఈ జంట రహమత్‌నగర్‌లో ఉంటోంది. ప్రశాంత్ కొరియర్ బాయ్‌గా పని చేస్తుండగా.. భార్య ఇంట్లోనే ఉంటుంది. కట్ చేస్తే.. వృత్తిలో భాగంగా ప్రశాంత్‌కి కిరణ్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. వీరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో.. కిరణ్ తరచూ ప్రశాంత్ ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలోనే తేజస్విని, కిరణ్‌కి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే.. ఈ విషయం ప్రశాంత్ ముందు తేజస్వినిని కిరణ్ ‘అక్క’ అని పిలిచేవాడు. దీంతో.. వారి మధ్య ఉన్న బంధాన్ని అతడు పసిగట్టలేకపోయాడు.
Joe Biden: అమెరికా అధ్యక్షుడి భారత్ పర్యటన… సెప్టెంబర్ 7 నుంచి 10 వరకు
కట్ చేస్తే.. ఈనెల 20వ తేదీన ప్రశాంత్ బంధువుల ఇంట్లో ఓ ఫంక్షన్ ఉండటంతో, భార్యతో కలిసి వెళ్లాలని అతడు అనుకున్నాడు. కానీ.. తేజస్విని మాత్రం రాలేనని చెప్పింది. ‘నువ్వు వెళ్లిరా’ అని చెప్పి, భర్తను అందంగా ముస్తాబు చేసి, ఫంక్షన్‌కు పంపించింది. ప్రశాంత్ ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి రాగా.. ఇంట్లో భార్య కనిపించలేదు. ఆమె దుస్తులు, నగదు, ఇతర వస్తువులు కూడా కనిపించలేదు. ఇదే సమయంలో కిరణ్ కూడా అదృశ్యమయ్యాడని తెలిసింది. దీంతో.. తనని మభ్యపెట్టి కిరణ్, తేజస్విని వెళ్లిపోయారన్న సంగతిని ప్రశాంత్ గ్రహించాడు. వెంటనే అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కిరణ్ మాయమాటలు చెప్పి తన భార్యను తీసుకెళ్లి ఉండొచ్చని ప్రశాంత్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.
