NTV Telugu Site icon

Wife Burns Husband: ఖమ్మంలో దారుణం.. చెవి దుద్దులు కోసం భర్తకు నిప్పంటించిన భార్య

Khammam Crime

Khammam Crime

Wife Burns Husband: బంగారు చెవిదిద్దెలు కొనివ్వలేదని ఆగ్రహంతో తన భర్తను నిప్పుపెట్టిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది. భర్త కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ షాకింగ్ ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది.

Read also: Kolagatla Veerabhadra Swamy: చంద్రబాబు పొత్తులు లేకుండా ఎప్పుడూ గెలవలేదు.. ఇప్పుడు పొత్తులు ఉన్నా సాధ్యంకాదు..!

ఖమ్మం జిల్లా నిజాంపేటలో షేక్ యాకూబ్ పాషా, సమీనా నివాసం ఉంటున్నారు. దంపతులిద్దరూ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కొద్దిరోజుల వారిజీవితం సాఫీగానే కొనసాగింది. అయితే.. రాను రాను వారి కాపురంలో బంగారంపై కలతలు మొదలయ్యాయి. సమీనాకు బంగారం చెవిదిద్దులపై వ్యామోహం పెరిగింది. బంగారం చెవిదిద్దెలు కావాలని భర్తను అడిగింది. అయితే భర్త తన దగ్గర అంత డబ్బు లేదని మళ్లీ కొనిస్తానని చెప్పాడు. అయితే సమీనా తన బంగారు చెవిపోగులు కొనాలని తరచూ భర్తతో గొడవపడుతుండేది. ఈ విషయమై శనివారం సాయంత్రం ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరింది.

Read also: Satyendar Jain: సత్యేందర్ జైన్‌కు బెయిల్‌ తిరస్కరణ.. వెంటనే లొంగిపోవాలని సుప్రీం ఆదేశం

అయితే చెవిదిద్దుల కొనేందుకు తన వద్ద అంత డబ్బు లేదని, తరువాత కొనుగోలు చేస్తానని పాషా మళ్ళీ అదే మాట చెప్పాడంతో. దీంతో భర్త కోపోద్రిక్తురాలైన సమీనా భార్య ఇంకా ఎప్పుడు కొనిస్తావ్ అంటూ ఇంట్లో ఉన్న పెయింట్ కెమికల్స్ తీసుకొచ్చి పాషాపై పోసింది. దీంతో భర్య ప్రవర్తను చూసి భర్త పాషా నిర్ఘాంతపోయాడు. తాను ఎందుకు అలా ప్రవర్తిస్తుందో కాసేపు అర్థంకాలేదు. అయితే ఆలోచించే సమయంలోనే భర్తకు నిప్పంటించింది. దీంతో భర్త పాషా గట్టిగా కేకలు వేశాడు. కాపాలంటూ బయటకు పరుగులు పెట్టాడు. మంటలు చెలరేగి పాషాకు తీవ్రగాయాలయ్యాయి. ఇరుగుపొరుగు వారు గమనించి మంటలను ఆర్పి ఆస్పత్రికి తరలించారు. పాషా తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితారు సమీనాను అదుపులోకి తీసుకున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.
Satyendar Jain: సత్యేందర్ జైన్‌కు బెయిల్‌ తిరస్కరణ.. వెంటనే లొంగిపోవాలని సుప్రీం ఆదేశం