Congress IT Minister: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మిత్ర పక్షంతో కలిలి 65 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. హంగ్‌కు ఆస్కారం లేకుండా క్లియర్ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు హారతిపట్టారు. అయితే ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ సిద్దమవుతుంది. కాగా.. ఇవాళ సీఎల్పీ భేటీ తర్వాత సీఎం అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. ఇక.. ఏకవాక్య తీర్మాణంతో సీఎంను ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఇప్పుడు సీఎం ఎవరనేది ప్రచారం కన్నా.. తెలంగాణకు కాబోయే ఐటీ మినిస్టర్ ఎవరనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ చక్కర్లు కొడుతోంది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండు పర్యాయాలు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. అయితే.. ఈ రెండు సార్లు కూడా ఐటీ మంత్రిగా కేటీఆర్ పని చేసిన విషయం తెలిసిందే.. కేటీఆర్ తన సమర్థతతో ఐటీ శాఖకు కొత్త వన్నెను తీసుకొచ్చారు. తెలంగాణ యువత ఉద్యోగాల కోసమే కాకుండా.. ఉద్యోగ అవకాశాలు కల్పించే వ్యాపారవేత్తలుగా ఎదగాలని తొలి ఏడాదిలోనే టీ-హబ్ అనే వేదికకు అంకురార్పణ చేశారు కేటీఆర్. అయితే.. ఇదంతా పూర్తిగా కేటీఆర్ ఆలోచనల్లోంచి పుట్టిందే అని చెప్పడంలో సందేహం లేదు.. ఏడేళ్లు తిరిగే సరికి టీ-హబ్ ప్రపంచ స్థాయి స్టార్టప్‌లకు వేదికగా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే.. అంతేకాదు.. కేటీఆర్ ఐటీని కేవలం హైదరాబాద్ కే పరిమితం చేయలేదు.. కరీంనగర్, ఖమ్మం వంటి టూటైర్ నగరాలకు కూడా విస్తరించిన ఘనత కేటీఆర్‌దే అని చెప్పాలి.. అంతేకాదు.. ఐటీ రంగాన్నే కాకుండా ఫార్మా, ఆటోమొబైల్ వంటి రంగానికి చెందిన సంస్థల అభివృద్దికి కూడా ప్రత్యేక ప్రణాళిక రచించారు. కేటీఆర్.. ఐటీ మినిస్టర్‌గా ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలు హైదరాబాద్‌లో తమ కార్యక్రమాలుగా ఏర్పాటు చేసేలా ఓరైంజ్ లో ఐటీని అభివృద్ది చేశారు.
Read also: Top Headlines@1PM: టాప్ న్యూస్
ఇక.. ఫేస్‌బుక్, గూగుల్, అమెజాన్ వంటి అంతర్జాతీయ సంస్థలు తమ క్యాంపస్‌లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడమే కాకుండా.. ఐకియా, లులూ వంటి వాటిని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు కేటీఆర్. ఇదంతా ఐటీ మంత్రిగా కేటీఆర్ చేసిందే అని కచ్చితంగా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధిష్టానం రానుంది. దీంతో తెలంగాణలో ఐటీ శాఖ ఎవరికి ఇస్తారనేది ట్రెండింగ్ టాపిక్. ఇప్పుడు.. బీఆర్ఎస్ ఓటమి కాంగ్రెస్ విజయాన్ని పక్కన పెడితే నెక్ట్స్ ఐటీ మినిస్టర్ ఎవరంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇండియాలోనే ద బెస్ట్ ఐటీ మినిస్టర్ మీరే అంటూ కేటీఆర్‌ను పొడుగుతూ పోస్టులు పెడుతున్నారు. ఇక కేటీఆర్ లేని ఐటీ శాఖను ఊహించుకోలేమంటూ ఫలితాలు వెలువడిన కాసేపటి నుంచే నెటిజన్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ గా మారాయి. సార్ మీరు లేని ఐటీని మేము ఊహించుకోలేము. మీరు ఐటీ మినిష్టర్ అంటూ ఐ మిస్ యూ సార్ అంటూ లక్షల సంఖ్యలో పోస్ట్ లు పెడుతున్నారు.
అయితే కేటీఆర్ ఐటీ పోస్ట్ ను.. కాంగ్రెస్ పార్టీ ఎవరిని నియమించనుంది అనేది హాట్ టాపిక్. కాంగ్రెస్ పార్టీ నుంచి ఐటీ మినిస్టర్‌గా దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. శ్రీధర్ గతంలో ఓసారి మంత్రిగా చేసిన అనుభవం, ఉన్నత విద్యావంతుడు, విషయ పరిజ్ఞానం ఉన్నవాడు. దీంతో శ్రీధర్‌బాబుకే ఐటీ ఇచ్చే అవకాశం ఇస్తారనే ప్రచారం చక్కర్లు కొడుతోంది. అయితే ఆ పదవి ఎరికి కట్టబెడతారనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది. మరి ఐటీ మినిష్టర్ గా కేటీఆర్ లా కాంగ్రెస్ నాయకులు ఎవరు వచ్చిన ఆయన పాత్రను నిర్వర్థించగలరా? అని ప్రశ్నలు వస్తున్నాయి. ఏదైతేనేం ఇప్పుడు సీఎం పదవి ఎవరనేదిపై కాకుండా.. ఐటీ మినిష్టర్‌ఎవరు అనేది తేలాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. మరోవైపు మరికొందరు కాబోయే సీఎం వద్దే ఈ శాఖను ఉంచుకోవచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉండగా సీఎం రేసులో రేవంత్, భట్టివిక్రమార్కలు ఉన్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ రేవంత్ సీఎం అయితే ఈ శాఖను ఆయనే నిర్వర్తించగలరని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Huge No Ball: ఇది నో బాల్ కాదు.. అంతకుమించి!