NTV Telugu Site icon

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today 1280

Whats Today 1280

Whats today updates 25.07.2022

1. నేడు కడెం ప్రాజెక్ట్‌ను సీఎం కేసీఆర్‌ పరిశీలించనున్నారు. అంతేకాకుండా ఎస్సారెస్పీ, కాళేశ్వరం ప్రాజెక్ట్‌లను సైతం సీఎం కేసీఆర్‌ పరిశీలించనున్నారు.

2. ఆధార్‌-ఓటర్‌ ఐడీ లింక్‌పై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరుగనుంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సూర్జేవాలా పిటిషన్‌ దాఖలు చేశారు.

3. నేడు విజయవాడలో డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్‌ యజమానులు భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు గాంధీనగర్‌ తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌లో సమావేశం జరుగనుంది. ఓటీటీలో విడుదలతవుతున్న సినిమాలు నిలిపివేయాలని తీర్మానం చేసే అవకాశం ఉంది.

4. నేటి నుంచి తెరుచుకోనున్న శ్రీలంక అధ్యక్ష కార్యాలయం. కొత్త అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.

5. నేడు రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 10.15 గంటలకు పార్లమెంట్‌ హాల్‌లో ప్రమాణం స్వీకరించనున్నారు. ముర్ముతో సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రమాణం చేయించనున్నారు.

6. నేటి నుంచి జేఈఈ మెయిన్స్‌-2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి ఈ నెల 29 వరకు పరీక్షలు జరుగనున్నాయి.

7. నేడు కలెక్టర్లతో తెలంగాణ మంత్రులు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, గంగుల కమలాకర్‌, కొప్పులు ఈశ్వర్, సత్యవతి రాథోడ్‌లు పాల్గొననున్నారు. పారిశుద్ధ్యం, గురుకులాలు, హాస్టళ్లపై సమీక్ష నిర్వహించున్నారు.

8. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ. 46,900లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,160లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 61,200లుగా ఉంది.