Whats Today Updates 21.07.2022
1.నేడు, రేపు ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. కోనసీమ, పి.గన్నవరం, రాజోలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు.
2. నేడు రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగనుంది. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో ఉదయం 11 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుంది.
3. నేడు ఈడీ విచారణకు కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి సోనియా గాంధీ రానున్నారు.
4. నేడు సెప్టెంబర్ నెలకు వర్చువల్ సేవా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది.
5. నేడు దేశవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. సోనియాపై ఈడీ కేసును వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టనున్నారు కాంగ్రెస్ నేతలు.
6. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,400లుగా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50,620లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 60,700లుగా ఉంది.
