Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

1. నేడు విజయవాడకు పవన్‌ కల్యాణ్ రానున్నారు. ఎంబీకే భవన్‌లో రెండో విడత జనవాణి-జనసేన భరోసా కార్యక్రమానికి హాజరుకానున్నారు. ప్రజల సమస్యలపై అర్జీలను స్వీకరించనున్నారు పవన్‌ కల్యాణ్. తొలి విడతలో జనవాణికి 427 అర్జీలు అందాయి.

2. నేడు హైదరాబాద్‌ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,950 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,210 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.62,800 లుగా ఉంది.

3. నేడు వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ పోరు జరుగనుంది.

4. నేడు గోల్కొండ బోనాలు. జగదాంబిక అమ్మవారిని దర్శించుకోనున్న భక్తులు. షేక్‌పేట్‌ నుంచి తొట్టెలతో భక్తులు రానున్నారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు.

5. తెలంగాణలో వైఎస్‌ షర్మిల పాదయాత్ర వాయిదా. భారీ వర్షాల కారణంగా ప్రజాప్రస్థానం యాత్ర వాయిదా వేస్తున్నట్లు ఆ పార్టీ శ్రేణులు వెల్లడించాయి. నేటి నుంచి ప్రారంభం కావాల్సి పాదయాత్ర ఈ నెల 12కు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

6. నేడు హైదరాబాద్‌లో బీజేపీ నేత తరుణ్‌చుగ్‌ పర్యటించనున్నారు. చేరికలు, ఫైనాన్స్‌ కమిటీ, ప్రజా సమస్యల అధ్యయన కమిటీలతో భేటీ కానున్నారు.

7. నేడు విజయవాడలో బీజేపీ పదాధికారుల సమావేశం జరుగనుంది. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అంశాలపై చర్చించనున్నారు. ఏపీ బీజేపీ కార్యక్రమాల పురోగతిపై సమీక్ష నిర్వహించనున్నారు.

8. నేడు విజయనగరంలో కేఏపాల్‌ పర్యటించనున్నారు.

9. నేడు ప్రపంచ వ్యాప్తంగా బక్రీద్‌ పండుగ. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల సీఎంలు ముస్లిం సోదరలకు బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు.

 

 

Exit mobile version