1. నేడు హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో మహిళా దర్బార్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు మహిళా దర్బార్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన మహిళలతో మాట్లాడనున్న గవర్నర్ తమిళసై.
2. ఢిల్లీ పీజీ మెడికల్ సీట్ల వివాదంపై నేడు సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది. 1,456 పీజీ మెడికల్ సీట్లు ఖాళీగా ఉండడంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది.
3. నేడు ఎమ్మెల్సీ అనంతబాబు కస్టడీ పిటిషన్‌పై రాజమండ్రి కోర్టులో విచారణ జరుగనుంది. అయితే ఇప్పటికే ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్‌పై విచారణ ఈ నెల 13కు కోర్టు వాయిదా వేసింది.
4. నేడు ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల చేయనున్నారు. వచ్చే నెలలో టెట్ నిర్వహించనున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ వెల్లడించింది.
5. నేడు నాలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు జరుగనున్నాయి. మహారాష్ట్ర 6, రాజస్థాన్ 4, కర్ణాటక 4, హర్యానాలో 2 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.
6. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,950లుగా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,310లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 68,000లుగా ఉంది.
