Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

1. నేడు ఫ్రెంచ్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరుగనుంది. టైటిల్‌ కోసం నాదల్‌తో రూడ్‌ తలపడనున్నాడు. సాయంత్రం 6.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

2. నేడు సీఎం కేసీఆర్‌ను జార్ఖండ్‌ సీఎం సొరెన్‌ కలువనున్నారు. ఈ సందర్భంగా జాతీయ ప్రత్యామ్యాయ రాజకీయ శక్తి అంశంపై చర్చించనున్నారు.

3. నేడు సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్షలు జరుగనున్నాయి. రెండు సెషన్లలో పరీక్ష నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పరీక్షకు 48,996 మంది అభ్యర్థులు హజరుకానున్నారు.

4. నేడు ఢిల్లీ జంతర్‌మంతర్‌ దగ్గర ఆప్‌ ధర్నా చేపట్టనుంది. కాశ్మీర్‌ పండిట్ల హత్యలపై ఆప్‌ ఆందోళన చేయనుంది. ఈ నిరసన కార్యక్రమంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, మనీష్‌సిసోడియా పాల్గొననున్నారు.

5. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,750లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,100లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 67,500లుగా ఉంది.

Exit mobile version