Site icon NTV Telugu

DCP Vijay Kumar: ప్రజాభవన్ ముందు యాక్సిడెంట్ కేసు.. దుబాయ్ లో రాహిల్, షకీల్..

Dcp Vijay Kumar

Dcp Vijay Kumar

DCP Vijay Kumar: ప్రజాభవన్ ముందు యాక్సిడెంట్ కేసులో A3 గా ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పరారీలో ఉన్నాడని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ అన్నారు. రాహిల్, షకీల్ ఇద్దరు దుబాయ్ లో ఉన్నట్లు సమాచారం ఉందని అన్నారు. ప్రధాన నిందితుడు రాహిల్ తో పాటు.. మాజీ ఎమ్మెల్యే షకీల్ పై కూడా లుక్ ఔట్ నోటీసులు జారీ చేశామన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురిని అరెస్ట్ చేశామని క్లారిటీ ఇచ్చారు. పంజాగుట్ట మాజీ ఇన్స్పెక్టర్, బోధన్ మాజీ ఇన్స్పెక్టర్ లను అరెస్ట్ చేసి జడ్జ్ ముందు ప్రొడ్యూస్ చేశామన్నారు. వారిద్దరికి పర్సనల్ బాండ్ పైన కోర్టు బెయిల్ ఇచ్చిందని తెలిపారు. ఈ కేసులో మొత్తం 16 మంది పై కేసు నమోదు చేశామన్నారు. నిందితులకు పోలీసులు సహకరించినట్లు గుర్తించామని అన్నారు. ఈ కేసులో నిందితులకు సహకరించిన వారిపై కేసులు నమోదు చేశామన్నారు. జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో మార్చ్ 2022 లో యాక్సిడెంట్ జరిగిందని, ఈ యాక్సిడెంట్ లో ఒక బాబు చనిపోయాడని అన్నారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ ని తప్పించారనే వార్తలు వచ్చాయని తెలిపారు. ఆ కేసును కూడా తిరిగి విచారణ చేస్తామని, ఆ కేసులో కోర్టులో ట్రయల్ జరుగుతుందన్నారు.

Read also: Zambia Cholera Outbreak: కలరాతో 600 మంది మృతి.. జాంబియాకు భారత్ సాయం!

ఒక మరోవైపు పంజాగుట్ట మాజీ సీఐ దుర్గారావుకు నాంపల్లి కోర్టు బెయిల్ నిరాకరించింది. ప్రజాభవన్ వద్ద బారికేడ్లు కొట్టి పారిపోయిన బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సాహిల్‌ను కేసు నుంచి తప్పించారని ఆరోపణలు రావడంతో దుర్గారావును అధికారులు సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పరారీలో ఉన్న దుర్గారావును సోమవారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌లోని రేణిగుంటలో పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం నాంపల్లి కోర్టు న్యాయమూర్తి నివాసంలో ఆయనను హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి దుర్గారావుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. పోలీసుల విచారణకు సహకరించాలని, దేశం విడిచి వెళ్లవద్దని ఆదేశించారు. కాగా, ఈ కేసులో ఇప్పటి వరకు 11 మంది నిందితుల్లో 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు సాహిల్, అతని తండ్రి షకీల్ దుబాయ్‌లో ఉండటంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వారి కోసం గాలిస్తున్నారు.
Kishan Reddy: గావ్​ చలో కార్యక్రమం.. పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి

Exit mobile version