NTV Telugu Site icon

Weather Latest Update: నేడు ఈ జిల్లాల్లో కుండపోతే! ఐఎండీ వెల్లడి

Weather Latest Update

Weather Latest Update

Weather Latest Update: తూర్పు విదర్భ నుండి తెలంగాణ మీదుగా, కర్ణాటక అంతర్భాగంలో ఉత్తర అంతర్గత తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రానున్న మూడు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (40 నుండి 50 కి.మీ. వేగంతో గాలులు) వీచే అవకాశం ఉంది. రాగల 3 గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, పెద్దపల్లి, సూర్యాపేట మీదుగా ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు ఉపరితల ఆవర్తనం కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములు మరియు వడగళ్ళు 30 నుండి 40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 30 డిగ్రీలు, 22 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ నుంచి గంటకు 8 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ట ఉష్ణోగ్రత 32.8 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 98 శాతంగా నమోదైంది.

ఏపీలో ఈరోజు, రేపు ఉరుములతో కూడిన భారీ వర్షాలు..

విదర్భ నుంచి తెలంగాణ, కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోందని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈరోజు, రేపు ఉరుములతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈరోజు కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఉరుములతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉందని ఆయన చెప్పారు. చెట్ల కింద ఎవరూ ఉండకూడదు.
AdiReddy Apparao: ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్ లకు మే 12 వరకు రిమాండ్‌

Show comments