NTV Telugu Site icon

Weather In Telangana: మరో రెండు రోజులు చలితో వణకాల్సిందే..

Meteorological Center1

Meteorological Center1

Weather In Telangana: నేటి నుంచి రానున్న ఐదు రోజుల పాటు తెలంగాణలో ఎక్కడా వర్షాలు కురిసే సూచనలు లేవని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాతావరణం పొడిగా ఉంటుందని తెలిపారు. కానీ, చలి తీవ్రత మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. తెలంగాణ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడైంది. మరో రెండు రోజుల పాటు చలి తీవ్రత పెరుగుతుందని వెల్లడించారు.

హైదరాబాద్‌లో ఆకాశం నిర్మలంగా ఉంది. నగరంలో తెల్లవారుజామున పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 17 డిగ్రీల సెంటీగ్రేడ్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. ఈశాన్య దిశ నుంచి గంటకు 4 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ బులెటిన్‌లో పేర్కొంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నిన్న నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు విడుదల చేశారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో చలి విపరీతంగా ఉందని తెలిపారు. ఇక్కడ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.

నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ, వరంగల్ జిల్లాల్లోనూ 11 నుంచి 15 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. నారాయణపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో 15 డిగ్రీలకు పైగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఎలాంటి హెచ్చరికలు చేయలేదు.
Pig Hotel: నేను ఎప్పుడూ చూడలే.. పందులకోసం ఫైవ్‌ స్టార్‌ హోటలా?

Show comments