NTV Telugu Site icon

Weather Report: తెలుగు రాష్ట్రాలకు నేడు వర్షాలు తక్కువే.. ఐఎండీ వెల్లడి..

Wether Report

Wether Report

Weather Report: తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా పశ్చిమ, నైరుతి దిశల నుంచి అల్పపీడన గాలులు వీస్తున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుకుగా ఉన్నాయని అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు, రేపు కొన్ని చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 33 డిగ్రీలు, 25 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. పశ్చిమ, నైరుతి దిశలో ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది.

Read also: AP Crime: డ్రగ్స్‌ కేసులో ఉన్నారని బెదిరింపులు.. మహిళా ఉద్యోగి నుంచి రూ.32 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

ప్రస్తుతం ఏపీ, యానాం మీదుగా అల్పపీడనం నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. జూలై 4న అమరావతి వాతావరణ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో కూడా ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాయలసీమలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని తెలిపారు.
Acne Problem: ముఖంపై మొటిమలతో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా చేయండి..