Site icon NTV Telugu

331 షీ టీమ్స్ అన్ని జిల్లాలో ఏర్పాటు చేశాం: ఏడీజీ స్వాతి లక్రా

మహిళల పై జరుగుతున్న నేరాలను నిర్ములించడానికి ఉమెన్ సేఫ్టీ వింగ్ వచ్చిందని ఏడీజీ స్వాతి లక్రా అన్నారు. ఈ సందర్భంగా వుమెన్‌ సేప్టీ వింగ్‌ను డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్‌, రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్,సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ .ఎన్జీవో స్వచ్ఛంద సంస్థలు మహిళల నేరాలను నిర్మిలించడానికి పోలీసులతో కలిసి పని చేస్తున్నారని, 331 షీ టీమ్స్ అన్ని జిల్లాలో ఏర్పాటు చేశామని స్వాతి లక్రా అన్నారు.మహిళలపై జరుగుతున్న అనేక రకాల నేరాలను అరికట్టేందుకు సైబర్ ల్యాబ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు. సైబర్ సేఫ్టీ ఎక్స్‌పర్ట్ తో కాలేజీ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. సైబర్ కాంగ్రెస్ పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు అవగాహన కల్పిస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6 భరోసా కేంద్రాలను ప్రారంభించినట్టు తెలిపారు. మహిళల పై చిన్నారుల పై జరుగుతున్న హత్యాచారాలు, హత్యల పై సైబర్ ఎక్స్‌పర్ట్స్‌తో నేరస్తులనుగుర్తిస్తున్నామన్నారు.మిస్సింగ్ పర్సన్ మానిటరింగ్ సెల్‌ను కూడా ప్రారంభించినట్టు తెలిపారు. NRI సెల్ ద్వారా ఇతర దేశాల ఉన్న నేరస్తులను గుర్తిస్తున్నట్టు స్వాతి లక్రా తెలిపారు. అనంతరం డీజీపీ, సీపీలు మాట్లాడారు.

తెలంగాణ డిజీపీ మహేందర్ రెడ్డి..
ఉమెన్‌ సేప్టీ వింగ్‌లో పనిచేస్తు్న్న అధికారులను తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి అభినందించారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రతను పెంచడానికి ఉమెన్‌సేప్టీ ఎంతగానో కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మహిళల భద్రత మీద ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు. మహిళల పై జరుగుతున్న నేరాలను సత్వరం పరిష్కరించేందుకు సైబర్ ల్యాబ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మిస్సింగ్ పర్సన్ యూనిట్ అనేసేఫ్ సహకారంతో దీనిని ఏర్పాటు చేసినట్టు డీజీపీ తెలపారు. 800 పోలీస్ స్టేషన్లో నమోదైన మిస్సింగ్ కేసులను సైబర్ ల్యాబ్ మానిటరింగ్ చేస్తుందన్నారు. మహిళ భద్రత ను దృష్టిలో ఉంచుకుని కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్ లో 7 లక్షల సీసీటీవీ కెమెరాలు ఉన్నాయన్నారు. గత 6 ఏళ్లలో నేరస్తులకు 58 శాతం శిక్షలు పడేలా చేశాం.

హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్…..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిటిజన్ సేప్టీ కోసం పోలీస్ శాఖ అనేక నూతన కార్యక్రమాలు చేపడుతుందని హైదరాబాద్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ అన్నారు. నేరస్తులకు న్యాయస్థానాల్లో శిక్ష పడేలా చేస్తున్నాం. సైబర్ ల్యాబ్ అనేది మహిళల రక్షణ కోసం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖ పరిధిలో చాలామంది నేరస్తులకు జీవిత కాలం శిక్ష పడేలా చేశామన్నారు.

రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్..
మహిళల పై రోజురోజుకు పెరుగుతున్న నేరాలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం షీ టీమ్ ప్రారంభించింది. మహిళల నుండి చిన్నారుల వరకు హత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. ఇలాంటి కేసుల్లో పోలీస్ శాఖ సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తుంది. వీటన్నింటినీ నిర్మూలించడానికి సైబర్‌ టీం కృషి చేస్తుందన్నారు.

సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర….
మహిళల పై జరుగుతున్న నేరాలను నిరోధించడానికి సైబర్ ల్యాబ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సోషల్ మీడియాలో మహిళల జరుగుతున్న నేరాలనిరోధించడానికి సైబర్ ల్యాబ్ కృషి చేస్తోంది. ఆన్ లైన్‌లో మహిళ పై వేధిస్తున్న నేరగాళ్ల గుర్తించడానికి సైబర్‌ ల్యాబ్‌ తోడ్పడుతుంది.

Exit mobile version