Renuka Chowdhury: ఎక్కడా దిక్కులేని వాళ్ళంతా కాంగ్రెస్ లోకి వస్తారని.. ఎవరు పార్టీలోకి వచ్చినా స్వాగతిస్తామని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరం అనుకుంటే రెండు చోట్లా పోటీ చేస్తా.. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎలా ఓట్ల కోసం వస్తారో చూస్తానని అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సీబీఐ విచారణ మంచిదే అని తెలిపారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. కాంగ్రెస్ లో గొడవలు చూసి సిగ్గు పడుతున్నానని, ఇంచార్జి వచ్చి సెట్ చేయాల్సిన పరిస్థితి రావడంతో సిగ్గు పడుతున్నానని అన్నారు. రేవంత్ పాదయాత్రలో పాల్గొంటా అని స్పష్టం చేశారు. మిగిలిన నాయకులు పాదయాత్ర ఎప్పుడు చేస్తారా అని చూస్తున్ననని ఎద్దేవ చేశారు. నేను కూడా వెళ్లి పాల్గొంటాని తెలిపారు.
Read also: MLA Guvvala Balaraju: ఎమ్మెల్యేల ఎర కేసు.. సీబీఐ విచారిస్తే మాకేం భయం?
ఖమ్మంకి రేవంత్ ని ఆహ్వానిస్తాం.. పెద్ద సభ పెడతామన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించడానికి ఎవరికి బాధ్యత అప్పచెప్పలేదన్నారు. దానిపై థాక్రే చూసుకుంటారన్నారు. ఎక్కడా దిక్కులేని వాళ్ళంతా కాంగ్రెస్ లోకి వస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు పార్టీలోకి వచ్చినా స్వాగతిస్తామన్నారు. పార్టీ మారిన mla లు ఎలా ఓట్ల కోసం వస్తారో చూస్తామన్నారు. గ్రామాల్లో ఓటుకి ఎలా వస్తారో చూపిస్తామన్నారు. పార్టీ మారిన mla లకు టికెట్ ఇచ్చేటప్పుడు ఇవ్వొద్దు అని చెప్పానని తెలిపారు. నేను ఖమ్మం అసెంబ్లీ నుండి పోటీ చేస్తా.. పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు అప్పుడు ఆలోచిస్తామన్నారు. గుడివాడ నుండి కూడా ఆహ్వానం ఉందని, అవసరం అనుకుంటే రెండు చోట్లా పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
Etala Rajender: బడ్జెట్ పై విమర్శలు చేయట్లే కానీ..
