NTV Telugu Site icon

Wazedu SI: నేడు వాజేడ్ ఎస్ఐ హరీష్ అంత్యక్రియలు

Si Harish

Si Harish

Wazedu SI: ములుగు జిల్లాలోని వాజేడు ఎస్ఐ హరీష్ సూసైడ్ చేసుకున్నాడు. సోమవారం నాడు పూసూరు జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ ప్రైవేటు రిసార్టులో సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకోగా.. తల కింది భాగం నుంచి తూటా వెళ్లడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మరణించాడు. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు ఎస్ఐ ఆత్మహత్యకు కారణాలపై ఆరా తీస్తున్నారు. అయితే, ఈ రోజు భూపాలపల్లి జిల్లాలో ఎస్ఐ హరీష్ అంత్యక్రియలు జరగనున్నాయి.

Read Also: Cyclone Fengal: తమిళనాడులో విషాదం నింపిన ఫెంగల్ తుఫాన్.. 18 మంది మృతి‌

ఇక, వాజేడు ఎస్ఐ హరీష్ మృతదేహానికి సోమవారం రాత్రి పోస్ట్ మార్టం పూర్తి అయింది. పోస్ట్ మార్టం తర్వాత ఎస్ఐ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించింది. ఎస్ఐ హరీష్ మృతదేహాన్ని సోమవారం అర్ధరాత్రి తన స్వస్థలం అయిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరుకొత్తపల్లి మండలం వెంకటేశ్వరపల్లి గ్రామానికి కుటుంబ సభ్యులు తరలించారు. ఈరోజు మధ్యాహ్నం వెంకటేశ్వరపల్లిలో ఎస్ఐ హరీష్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Show comments