Site icon NTV Telugu

Warangal: ప్రియుడితో కలిసి భర్త హత్యకు ఇల్లాలు కుట్ర.. బాధితుడు ఎలా బయటపడ్డాడంటే..!

Warngal

Warngal

భార్యాభర్తల మధ్య సంబంధాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. వివాహేతర సంబంధాలతో పచ్చని సంసారాలను కూల్చుకుంటున్నారు. దేశంలో ఎక్కడొక చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటున్నాయి. ప్రియుడితో సుఖం కోసం కట్టుకున్నవాడినే కడతేర్చేస్తున్నారు. కఠిన చట్టాలు అమలవున్నా.. మార్పు రావడం లేదు. తాజాగా వరంగల్‌లో భార్య, ప్రియుడి కుట్ర నుంచి ఓ భర్త బయటపడ్డాడు.

ఇది కూడా చదవండి: Vice President Election: ఆప్, ఆర్జేడీ ఎంపీలు క్రాస్ ఓటింగ్.. స్వాతి మాలివాల్ ఎవరికి ఓటేశారంటే..!

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సోమారం గ్రామ పరిధిలోని జగ్గుతండాలో ఓ ఇల్లాలు వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్త బానోత్ మహేష్‌కు తెలిసింది. దీంతో భర్తను చంపేయాలని ప్రియుడితో కలిసి భార్య కుట్ర పన్నింది. అయితే ఇటీవల బానోత్ మహేష్‌ దాడి నుంచి బయటపడ్డాడు. దీంతో తనకు రక్షణ కల్పించాలంటూ బానోత్ మహేష్ పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య.. ప్రియుడితో కలిసి చంపేందుకు ప్రయత్నిస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశాడు.

ఇది కూడా చదవండి: Vice President Election: ఉపరాష్ట్రపతి ఎన్నికలు ప్రారంభం.. తొలి ఓటు వేసిన మోడీ

Exit mobile version