Warangal-Karimnagar:ఓరుగల్లు మహానగర ప్రజలకు వరద ముప్పు నుంచి విముక్తి కల్పించే పనులు ప్రారంభమయ్యాయి. వరదలకు ప్రధాన కారణమైన నయీంనగర్ కెనాల్ విస్తరణ, వంతెన పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. వంతెన నిర్మాణంతో కరీంనగర్-వరంగల్ ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. మూడు నెలల పాటు వాహనాలను దారి మళ్లిస్తామని అధికారులు ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు. నయీమ్‌నగర్ పెద్దమోరి కూల్చివేత పనులు కొనసాగుతున్నందున ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్జా తెలిపారు. రూ.8.5 కోట్లతో నూతన వంతెన నిర్మిస్తున్నందున 3 నెలల పాటు నయీంనగర్ రోడ్డులో రాకపోకలు నిలిచిపోతాయన్నారు. నగర ప్రజలు ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించి ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి సహకరించాలని సీపీ కోరారు.
Read also: Bangalore: మెడికల్ కాలేజీలో ఫుడ్ పాయిజన్.. 47 మంది విద్యార్థులకు అస్వస్థత
కరీంనగర్ నుంచి ఖమ్మం, నర్సంపేట, వరంగల్ వైపు వెళ్లే భారీ వాహనాలు కేయూసీ జంక్షన్ నుంచి పెగడపల్లి డబ్బాలు, పెద్దమ్మ గడ్డ, ఆటోనగర్ మీదుగా వెళ్లాలి. కరీంనగర్ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు కేయూసీ జంక్షన్ నుంచి పెగడపల్లి డబ్బాలు, పెద్దమ్మ గడ్డ, ములుగు రోడ్డు, అమృత జంక్షన్, హనుమకొండ చౌరస్తా మీదుగా బస్టాండ్‌కు చేరుకోవాలి. ఖమ్మం నుంచి కరీంనగర్ వైపు వెళ్లే భారీ వాహనాలు ఉర్సుగుట్ట, కడిపికొండ, మడికొండ, ఓఆర్‌ఆర్ మీదుగా వెళ్లాలి. వరంగల్, నర్సంపేట నుంచి కరీంనగర్ వైపు వెళ్లే భారీ వాహనాలు ఎంజీఎం, ములుగు రోడ్డు జంక్షన్, పెద్దమ్మ గడ్డ, పెగడపల్లి డబ్బాలు, కేయూసీ జంక్షన్ మీదుగా వెళ్లాలి. హనుమకొండ నుంచి కరీంనగర్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు హనుమకొండ చౌరస్తా, అమృత, ములుగు రోడ్డు జంక్షన్, పెద్దమ్మ గడ్డ, పెగడపల్లి డబ్బాలు, కేయూసీ జంక్షన్ మీదుగా వెళ్లాలి.
NIA: పశ్చిమ బెంగాల్ ఎన్ఐఏ అధికారులపై దాడి.. ఇద్దరికి గాయాలు, కారు ధ్వంసం