Warangal Earthquake: వరంగల్, మణుగూరులో ఇవాళ తెల్లవారుజామున 4.43 గంటలకు స్వల్పంగా భూమి కంపించింది. పాత మణుగూరు, శేషగిరి నగర్, బాపన కుంట, శివలింగపురం, విట్టల్ రావు నగర్, రాజుపేట ప్రాంతాల్లో భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కాగా, మణుగూరులో గత వారం రోజుల్లోనే రెండుసార్లు భూమి కంపించింది. ఈ వరుస ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. నేషనల్ సిస్మోలాజికల్ సర్వే (ఎన్‌సీఎస్) ప్రకారం రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.6గా నమోదైంది. దాదాపు 30 కిలోమీటర్ల లోతు వరకు భూమి కంపించిందని చెబుతున్నారు. వరంగల్‌కు తూర్పున 127 కి.మీ, 30 కి.మీ. లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.
NCS ట్విట్టర్ పోస్ట్ ప్రకారం, ఇది సరిగ్గా భద్రాద్రి కొత్తగూడెం సమీపంలో జరిగింది. తెల్లవారుజామున సంభవించిన భూప్రకంపనలతో వరంగల్ ప్రజలు అల్లాడిపోయారు. ఏం జరిగిందో తెలియక ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే భూమి స్వల్పంగా కంపించడంతో వెంటనే ఊపిరి పీల్చుకున్నారు. భూకంపం కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లినట్లు సమాచారం అందలేదని అధికారులు వెల్లడించారు. కాగా, వారం వ్యవధిలో రెండు భూకంపాలు సంభవించడంతో భూకంప నిపుణులు స్పందించారు. భూకంపాలు సాధారణంగా భూమి లోపలి పొరల్లోని అమరికల వల్ల సాధారణంగానే భూ ప్రకంపనలు వస్తాయని. దీంతో పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదని చెబుతున్నారు. ఇవి సర్వసాధారణం కాబట్టి ప్రజలు భయపడాల్సిన పనిలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సింగరేణి బొగ్గు గనుల్లో మధ్యాహ్నం 3 నుంచి 3.30 గంటల మధ్య బ్లాస్టింగ్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. వీటి కారణంగా భూమి కంపించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
Read also: Telangana: తెలంగాణలో మరో రెండు రెవెన్యూ డివిజన్లు.. ప్రాథమిక నోటిఫికేషన్ జారీ
భూకంపం వస్తే ఏం చేయాలి?
భూకంపం సంభవించినప్పుడు, ముందుగా చేయవలసిన పని భయాందోళనలకు గురికాకుండా ఇతరులకు భరోసా ఇవ్వడం. సురక్షిత ప్రాంతంలో కవర్ చేయండి. ఇళ్లు మరియు భవనాలకు బదులుగా బహిరంగ స్థలాన్ని ఎంచుకోండి. ఇంటి లోపల డెస్క్‌లు లేదా టేబుల్స్ కింద, బెడ్‌ల కింద ఉండాలి. కిటికీలు మరియు అద్దాలను నివారించండి.పెద్ద పెద్ద భవనాలు అయిపోతే తొక్కిసలాట జరిగే అవకాశం ఉన్నందున హడావుడి చేయవద్దు. బయట కూడా భవనాలకు దూరంగా ఉండండి. విద్యుత్ తీగలకు దూరంగా ఉంచండి. కదులుతున్న వాహనాలు ఉంటే వెంటనే ఆపండి. బయట పెంపుడు జంతువులు (ఆవులు, కుక్కలు, మేకలు) ఉంటే, స్వేచ్ఛగా వదిలేస్తే పారిపోతాయి. భూకంపం ఆగే వరకు ఇంట్లోకి వెళ్లవద్దు. కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదని అధికారులు వెల్లడించారు.
Earthquake of Magnitude:3.6, Occurred on 25-08-2023, 04:43:11 IST, Lat: 18.04 & Long: 80.80, Depth: 30 Km ,Location: 127km E of Warangal, Telangana, India for more information Download the BhooKamp App https://t.co/zWYrykFgwj@ndmaindia @Indiametdept @Dr_Mishra1966 @KirenRijiju pic.twitter.com/LQ9dsnoOCP
— National Center for Seismology (@NCS_Earthquake) August 24, 2023