NTV Telugu Site icon

Warangal Traffic: నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు పాటించండి.. వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝ..

Warangal Traffic

Warangal Traffic

Warangal Traffic: వరంగల్ జిల్లా ట్రై సిటీలో రెండు రోజులు (16,17)న ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝ వెల్లడించారు. గణేష్ నిమజ్జన సందర్భంగా ఈనెల 16 మధ్యాహ్నం 12.00 నుండి మరుసటి రోజు తేది 17-09-2024 ఉదయం 10.00 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు పాటించాలని ప్రజలకు సూచించారు. వరంగల్, హన్మకొండ, కాజీపేట ట్రై సిటి పరిధిలో వినాయక నిమజ్జనం సందర్బంగా నిర్వహించే శోభాయాత్ర ఎలాంటి అటకం లేకుండా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. నిమజ్జనానికి విగ్రహాలను తరలించే మార్గాల్లో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండేందుకుగాని ట్రై సిటి పరిధిలో వాహనాలకు విధించిన ట్రాఫిక్ ఆంక్షలను అందరు పాటించాలన్నారు.

Read also: Breaking News: తెలంగాణ భవన్‌ వద్ద ఉద్రిక్తత..

ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..

* ములుగు,భూపాలపల్లి వైపు నుండి వచ్చు భారీ వాహనములు హైదరాబాద్ కు వెళ్ళవలసినవి ఆరెపల్లి వద్ద ఔటర్ రింగ్ రోడ్డు నుండి వెళ్ళవలెను. భూపాలపల్లి పరకాల నుండి ఖమ్మం వెళ్ళవలసినవి ఆరేపల్లి వద్ద ఔటర్ రింగ్ రోడ్డు నుండి కరుణాపురం, మడికొండ, కడిపికొండ, నాయుడు పెట్రోల్ పంపు నుండి వెళ్ళవలెను.

* భూపాలపల్లి మరియు పరకాల నుండి వచ్చు భారీ వాహనాలు నర్సంపేట వైపు వెళ్ళవలసినవి కొత్తపేట, రెడ్డిపాలెం, జాన్పీరిలు గొర్రెకుంట నుండి వెళ్ళవలెను.

* సిటి లోపలికి వచ్చు భారీ వాహనములు సిటి అవతల ఆపుకోవలెను. నిమజ్జన సమయంలో ఎలాంటి వాహనములు సిటి లోపలికి అనుమతించబడవు.

* ములుగు మరియు పరకాల వైపు నుండి వచ్చే బస్సులు వయా పెద్దమ్మగడ్డ నుండి కెయుసి, సి.పి.ఓ. అంబేద్కర్ సెంటర్, ఏషియన్ శ్రీదేవి మాల్ మీదుగా బస్టాండ్కు చేరుకోవాల్సిఉంటుంది.

* హన్మకొండ బస్టాండ్ నుండి బయలుదేరి ములుగు వైపు, కరీంనగర్ వైపు వెళ్ళు బస్సులు వయా ఏషియన్ శ్రీదేవి మాల్, అంబేద్కర్ సెంటర్, సి.పి.ఓ ద్వారా కెయుసి, జంక్షన్ మీదుగా వెళ్ళవలెను.

Read also: Ganesh Immersion: గణేశ్ నిమజ్జన ఊరేగింపులో వైసీపీ పాటలు.. కేసు నమోదు..!

* హన్మకొండ బస్టాండ్ నుండి బయలుదేరి నర్సంపేట, కొత్తగూడెం, భద్రాచలం, తొర్రూరు, ఖమ్మం వైపు వెళ్ళు బస్సులు వయా బాలసముద్రం, అదాలత్, హంటర్ రోడ్ మీదుగా వెళ్ళవలెను.

* వరంగల్ బస్టాండ్ నుండి హన్మకొండ వైపు వచ్చు బస్సులు చింతల్ బ్రిడ్జి నుండి రంగశాయిపేట్ మీదుగా నాయుడు పెట్రోల్ పంప్ సెంటర్, ఉర్సుగుట్ట, అదాలత్, బాలసముద్రం రోడ్ మీదుగా హన్మకొండకు చేరుకోవాలి.

* సిద్దేశ్వర గుండంలో నిమజ్జనం చేయు విగ్రహాలు 6 అడుగుల ఎత్తు వరకు ఉండి ట్రాక్టర్ మరియు TATA ACE లలో వచ్చే వాటిని మాత్రమే అనుమతించడం జరుగుతుంది మరియు అట్టి శోభాయాత్ర హంటర్ రోడ్, అదాలత్, CPO, హన్మకొండ చౌరస్తా, బాలాంజనేయ స్వామి టెంపుల్ మీదుగా వెళ్లి నిమజ్జనం అనంతరం వయా శాయంపేట మీదుగా తిరిగి వెళ్ళవలెను.

Read also: Big Breaking: హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై రచ్చ రచ్చ. బారిగేడ్లు తొలగించి నిమజ్జనాలు..

* హనుమకొండ కు చెందిన భారీ వినాయక విగ్రహాలు కోట చెరువు లేదా చిన్న వడ్డేపల్లి చెరువులో నిమజ్జనం కు వెళ్ళవలెను.

* కోట చెరువు వైపు నిమజ్జనం కొరకు వెళ్ళే వాహనాలు పెద్దమ్మగడ్డ, ములుగు జంక్షన్, యం.జి.యం, ఆటోనగర్ మీదుగా కోటచెరువుకు వెళ్ళవలెను, కోట చెరువులో వినాయక విగ్రహ నిమజ్జన అనంతరం వాహనాలు హనుమాన్ జంక్షన్ , పెద్దమ్మగడ్డ నుండి కేయూసి జంక్షన్ మీదగా తిరిగి వెళ్ళవలెను.

* ఎక్సైజ్ కాలనీ, రెవెన్యూ కాలనీ మరియు వడ్డేపల్లి ప్రాంతాల నుండి వచ్చే వినాయక విగ్రహాలు అన్ని బంధం చెరువులో నిమజ్జనం చేయవలెను.

* చిన్న వడ్డేపల్లి చెరువులో నిమజ్జనం చేయు విగ్రహాలు కాశిబుగ్గ, పోచమ్మ మైదాన్, దేశాయిపేట మీదుగా వెళ్లి నిమజ్జనం అనంతరం వయా ఎనుమాముల మార్కెట్ నుండి కాశిబుగ్గ మీదుగా తిరిగి వెళ్ళవెళ్లాలని పోలీస్ కమిషనర్ వెల్లడించారు.
స్నానానికి సబ్బు వద్దు.. సున్నిపిండి బెటర్‌..