Mallu Bhatti Vikramarka: ప్రజల నుండి పన్నుల రూపంలో వచ్చే ప్రతీ పైసా ప్రజా సంక్షేమం కోసమే ఖర్చు పెడతామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. హనుమకొండ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హల్ లో ఏర్పాటు చేసిన రైతు భరోసా పథకం అవగాహన సదస్సుకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క హాజరయ్యారు. బట్టి విక్రమార్కకు స్థానిక ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టత్మక మైన హామీలను నెరవేర్చిందన్నారు. మాది ప్రజా ప్రభుత్వం కాబట్టి.. ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ప్రజల నుండి పన్నుల రూపంలో వచ్చే ప్రతీ పైసా ప్రజా సంక్షేమం కోసమే ఖర్చు పెడతామన్నారు. అడ్డుగోలుగా వాటిని దుర్వినియోగం చేయమని తెలిపారు. రైతు భరోసా సదస్సుకు మంత్రులు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, కొండా సురేఖ.. 12 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఎంపీ రైతు సంఘ నాయకులు హాజరయ్యారు. రైతు భరోసా విధివిధానాలపై రైతులు, రైతు సంఘాలు, ప్రజాప్రతినిధులు, ఇతర వర్గాల నుంచి మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయాలను సేకరిస్తున్నారు.
Read also: Patancheru Congress: గూడెం మహిపాల్ రెడ్డి పార్టీలోకి వద్దు.. కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన..
రైతు బంధులో తప్పులు జరిగాయని మంత్రి సీతక్క అన్నారు. నిజానికి వ్యవసాయం చేసిన రైతులకు కాకుండా పట్టాలు ఉన్న వారికి మాత్రమే రైతు బందు గతంలో ఇచ్చారన్నారు. పట్ట బందు గానే మారిందన్నారు. 40 ఏళ్ల క్రితం భూము అమ్ముకొని పేరు మరకపోవడం తో సాగు చేసే రైతులకు పెట్టు బడి రాలేదన్నారు. ఈ లాంటి సదస్సులో గతంలో జరిగిన లోపాలను సరి చేసి నిజమైన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సదస్సు మంచి వచ్చే సూచనతో రైతులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. మరోవైపు మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. రైతు బంధు పథకం లో భూ స్వాముల లకు కాకుండా నిజమైన రైతులకు ఇవ్వాలని తెలిపారు. గత ప్రభుత్వం హయం లో భూ స్వాముల కు లక్షల రూపాయలు పొందారన్నారు. నిజమైన రైతులకు ఆడాల్సిన పెట్టుబడి సహాయం ఆడలేదన్నారు. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం లో రైతులకు సబ్సిడీలు అందాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు న్యాయం జరిగిందన్నారు. పశువులకు కూడా ఇన్స్యూరెన్స్ చేయించాలన్నారు. పశువులు చనిపోతే రైతులకు నష్టం జరుగుతోందని తెలిపారు.
Ponguleti Srinivas Reddy: గ్రామపంచాయతీలో నిధుల కొరత ఉన్న మాట వాస్తవమే..