NTV Telugu Site icon

Warangal BC Residential Hostel: బర్త్ డే వేడుకల్లో విషాదం.. పినాయిల్‌ తాగిన విద్యార్థినిలు

Mgm

Mgm

Warangal BC Residential Hostel: వరంగల్‌ జిల్లా అరెపల్లిలో బీసీ రెసిడెన్షియల్‌ హాస్టల్‌ లో విషాదం జరిగింది. విద్యార్థినుల మధ్య ఘర్షణ ఆత్మహత్య చేసుకునేందుకు దారితీసింది. అందరూ పదవ తరగతి చదువుతున్న ఒకే సెక్షన్‌ విద్యార్థినులుగా గుర్తించారు. విద్యార్థినిలు అస్వస్థత గురికావడంతో హాస్టల్ నిర్వాహకులు హుటాహుటిన ఎంజీఎంలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

read also: Nagashaurya Marriage: తాళికట్టిన నాగశౌర్య.. ఫోటోలు వైరల్

నిన్న సాయంత్రం ఐదుగురు విద్యార్థినుల్లో ఒక విద్యార్థిని బర్త్‌డే కావడంతో హాస్టల్ రూంలో వేడుకలు జరుపుకున్నారు. అది కాస్త అధికారులకు తెలిసింది. దీంతో అధికారులు విద్యార్థినులకు మందలించారు. మనస్తాపానికి గురైన విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అది గమనించిన హాస్టల్‌ నిర్వాహకులు వారిని ప్రథమ చికిత్సకోసం ఆసుపత్రికి తరలించారు. అయితే.. బర్త్‌డే వేడుకల్లో కేక్‌ కట్‌ చేసే సమయంలో విద్యార్థినుల మధ్య గొడవ జరిగిందని, వారిని మందలించడంతో మనస్తాపానికి గురైన విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తుంది. పెనాయిల్‌ తాగడంతో అస్వస్థకు గురయ్యారు విద్యార్థినులు. అది గమనించిన స్థానిక విద్యార్థినిలు అధికారులకు తెలియజేయడంతో వెంటనే ఎంజీఎంలో ఆసుపత్రికి తరలించారు. అయితే విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా వుందని అధికారులు వెల్లండించారు. ఎవరు ఎంక్వైరీకి వచ్చిన మేము సిద్దంగా వున్నామని హాస్టల్‌ నిర్వాహకులు చెబుతున్నారు. వీల్లందరూ మంచిగా చదువుకునే పిల్లలే అని, కానీ ఎందుకు ఇలా చేశారో అర్థం కావడం లేదని అధికారులు వెల్లడించారు.
Jeff Bezos: కార్లు, టీవీలు, ఫ్రిజ్‌లు కొనకండి.. ప్రజలకు అమెజాన్ అధినేత సూచన